నేడు తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వాడివేడిగా చర్చ జరిగింది. అయితే.. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద కార్గో విమానం దిగిందని, అది కూడా మేమే దించాం అంటున్నారని, అక్కడ ఎయిర్ పోర్ట్ ఉంది కాబట్టి కార్గో దిగిందన్నారు. మేము అన్ని వ్యవస్థలు ఏర్పాట్లు చేశాం కాబట్టి దానికి కొనసాగింపుగా మీరు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఐటీ కూడా అంతే.. మేము చేసిందే కదా అని ఆయన అన్నారు. పరిశ్రమలు రావడానికి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉండాలని, అది కట్టింది మేమే అని, ఐటీ కి రాజీవ్ గాంధీ పునాదులు వేశారన్నారు భట్టి. మీరు అధికారంలోకి రావడానికి ముందే ఐటీ హైదరాబాద్ కి వచ్చిందని భట్టి వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్ మేము ఇచ్చామని, కేంద్రం ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ నగరానికి ఎన్నో ఇచ్చామని, కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్.. ఐటీఐఆర్ ఇచ్చామని బీజేపీ ఆపిందని ఆయన ఆరోపించారు. వీళ్లు పోరాడలేదని, మేము వస్తాం.. అన్ని మేమే ఇస్తామన్నారు.
Also Read : Viral Video: బాంబు పేలింది.. పెళ్లికొడుకుతో గుర్రం తుర్రుమంది
కేటీఆర్ దావోస్ ప్రతీ ఏడాది వెళ్తున్నారని, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నట్టు పేపర్‌లో వార్తలు వస్తున్నాయని, అవి ఏం వచ్చాయో.. ఏం రాలేదో ఎవరికి తెలియదన్నారు భట్టి. అయితే. భట్టి మాట్లాడుతుండగా.. డిప్యూటీ స్పీకర్ మైక్ కట్ చేశారు. అయితే.. ఆగ్రహ వ్యక్తం చేసిన భట్టి.. బీఏసీలో ఎంత సేపు అయినా మాట్లాడండి అంటారని, ఇక్కడికి వస్తే.. కనీసం మైక్ ఇవ్వరన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే హోర్డింగులు అన్నీ కాంగ్రెస్ కో ఇవ్వొద్దు అన్నారని, హైదరాబాద్ అందరిదీ మెట్రో పిల్లర్లు కూడా వాళ్ళకే ఇచ్చారు.. అక్కడక్కడ మాకు కొన్ని అవకాశాలు ఇచ్చారు అంతే ఇదేం పద్ధతి. మధిర తెలంగాణలో లేదా.. మేము ఏం అడిగినా ఇవ్వడం లేదు. చెప్పేదేమో వివక్ష లేదంటున్నారు.. పశువుల దవాఖానలో న్యాయస్థానం నడుస్తోంది.. వినడానికి కూడా బాగోలేదు. హైదరాబాద్ లో భూములు అన్నీ అమ్మేస్తున్నారు. వేలం వేస్తే 50.. 60 కోట్లు ఎకరం పోయింది. పేదలకు ఇండ్ల స్థలాలు ఎట్లా ఇంత ధరలు పెంచితే. మేము మాట్లాడుతుంటే అడ్డుకుని.. మాట్లాడకుండా అధికార పార్టీ సభ్యులు కుట్ర చేస్తున్నారు. ఇదేం బాగోలేదు. తెలంగాణ ప్రజల్ని రెండు పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని భట్టి వ్యాఖ్యానించారు.
Also Read : Ananya Pandey: ఉఫ్.. విప్పి చూపించడం కాదు.. యాక్టింగ్ కూడా నేర్చుకో