Asaduddin owaisi: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో ఎంఐఎం పొత్తు గురించి ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో చెప్పేందుకు ఇంకా టైం ఉందని అన్నారు. ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని అన్నారు.
MLC Election: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో తెలంగాణలో హడావుడి ప్రారంభం అయింది. తెలంగాణలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతున్నాయి. ముఖ్యం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై మజ్లిస్ పార్టీ నజర్ పెట్టింది.
Tummala Nageswara Rao: విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కావద్దని, చిత్తశుద్ధితో పనిచేస్తే ఉన్నతస్థాయికి ఎదుగుతారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. నేలకొండపల్లిలో రాజకీయంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధిగా రెండు, మూడు సంవత్సరాల్లోనే అభివృద్ధి చేశానని అన్నారు. రామదాసు జీవిత చరిత్ర కోసం నాలుగు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. నేలకొండపల్లిలో డిగ్రీ, ఇంటర్ భవనాలకు ఏర్పాటు చేశామని, ప్రజల కోరిక మేరకు జాతీయ రహదారిని ఊరు బయటనుంచి…
Minister KTR: సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొందరు వ్యక్తులు చెప్పులు విసిరేందుకు ప్రయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనపై కొందరు అధికార పార్టీ నాయకులు ఆయనపై చెప్పులు విసిరేయత్నం చేయగా అక్కడే వున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వారిద్దరు అధికార పార్టీకి చెందిన వారికిగా గుర్తించినట్లు సమచారం.
Off The Record: వచ్చే ఎన్నికల్లో BRS, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మునుగోడు బైఎలక్షన్ తర్వాత చర్చ ఊపందుకుంది. ఉభయ పక్షాల నుంచి ఈ దిశగా ప్రకటనలు వచ్చాయి.. మాటలు కలిశాయి. అయితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేస్తాయా? అని ఆరా తీస్తున్నారు. తాజాగా వామపక్ష శిబిరాల నుంచి వస్తున్న స్టేట్మెంట్లతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. పొత్తులో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారని ఇన్నాళ్లూ…
Off The Record: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారు. సిట్టింగ్ ఎంపీగానే ఉన్నప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఓపిగా ఉన్న ఆయన బీఆర్ఎస్ను వదిలేయాలని డిసైడ్ అయ్యారు. పొంగు లేటి వర్గాన్ని బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తోంది. దమ్ముంటే తనపై వేటు వేయాలని మాజీ ఎంపీ అధికారపార్టీని సవాల్ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఇల్లెందు, అశ్వారరావుపేట, వైరా అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే, పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారనే…