వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఏడాది పూర్తి చేసుకున్నారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి నివేధికను మంత్రి విడుదల చేసారు. అనంతరం మట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా నీతి అయోగ్ తెలంగాణను గుర్తించింది.
మేము ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని Bjp రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికలకు మేం కూడా సిద్ధం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ సభ సన్నాహాల్లో భాగంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటన కొనసాగుతుంది. సిక్కుల పవిత్ర స్థలం గురుద్వార్ ను ఇవాల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బీవీ పాటిల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఇవాళ నిజామాబాద్లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించనున్నారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ ఆవరణలో కొత్త నిర్మస్తున్న కళాభారతికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.