అసెంబ్లీ మీడియా పాయింట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, సుంకే రవిశంకర్, దుర్గయ్య చిన్నయ్య బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణకు తలమానికంగా దేశములో ఎక్కడా లేనివిధంగా బ్రహ్మాండమైన సచివాలయం నిర్మించి డా.బీఆర్ అంబెడ్కర్ పేరు పెట్టామన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. భద్రాద్రి-ఇల్లందులో హత్ సే హత్ జోడో పాదయాత్రలో భాగంగా జె.కె. ఓ.సిలో ఐ.ఎన్.టి.యు.సి జెండాను ఆవిష్కరించి పిట్ మీటింగ్ లో పాల్గొన్నారు.
హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అసెంబ్లీ మీడియా పాయింట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రెడ్యానాయక్. డోర్నకల్ లో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడాడు అంటూ మండి మండిపడ్డారు.
Revanth Reddy: ప్రజలు సీఎం కేసీఆర్ కు ఇచ్చిన అవకాశం ముగిసిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రైతులకు 24 గంటల విద్యుత్ పై కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు. ఆనాడు బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంతో ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల్లో 50 శాతం కమిషన్లు దండుకున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
Off The Record: ఇటీవల పార్టీ సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లను ఉద్దేశించి ఆయన ఈ మాటలు అన్నారు. కేవలం ఏదో ఆరోపణలు.. విమర్శలకు పరిమితం కాకుండా.. ఆ IAS అధికారులపై ఫిర్యాదు చేస్తామని.. వారు చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతామని సంజయ్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ఆరోపణలు ఎలా ఉన్నా.. అసలు సంజయ్కు వారిపై సమాచారం…