Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. భద్రాద్రి-ఇల్లందులో హత్ సే హత్ జోడో పాదయాత్రలో భాగంగా జె.కె. ఓ.సిలో ఐ.ఎన్.టి.యు.సి జెండాను ఆవిష్కరించి పిట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డిని సింగరేణి కాంట్రాక్టు కార్మికులు కలిసారు. పర్మినెంట్ చేయాలని రేవంత్ రెడ్డికి కార్మికులు వినతి పత్రం అందజేశారు. రెగ్యులర్ కార్మికులను తొలగించి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో గనికార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఒకప్పుడు 70వేలు ఉన్న ఉద్యోగులు 40వేలకు తగ్గిపోయారని, కమీషన్ల కక్కుర్తి కోసం ఓపెన్ కాస్ట్ గనులను ప్రయివేటుకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. సింగరేణిని ప్రయివేటు పరం చేయొద్దని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశామన్నారు. సింగరేణి ఆధీనంలో ఉన్న గనులను ప్రయివేటుకు అప్పగించి దోపీడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గనులను ప్రయివేటుకు కట్టబెట్టి 25వేల కోట్లు దోపీడికి పాల్పడాలని చూస్తున్నారని అన్నారు.
Read also: BIG Breaking: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా..
Also Read
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
సింగరేణికి జెన్ కో 12 వేల కోట్ల బకాయి పడిందని స్పష్టం చేశారు. అందుకే సింగరేణిలో కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికి సిఎండీ శ్రీధర్ కారణం మని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ కేసులు ఉన్న అధికారి సిఎండీగా ఉండటానికి వీల్లేదని మండిపడ్డారు. రెండు మూడేళ్లు మాత్రమే ఆ స్థానంలో ఉండాల్సిన అధికారి ఏళ్లు గడుస్తున్నా సిఎండీగా కొనసాగుతున్నారని ఆరోపించారు. ఓపెన్ కాస్ట్ మైన్ తో కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. 10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సింగరేణిలో దోపిడీకి పాల్పడిన వ్యక్తులను కటకటాల్లోకి పంపిస్తామన్నారు. గతంలో ఇలాంటి పనులు చేసిన ఐఏఎస్ అధికారుల పరిస్థితి ఏమైందో సిఎండీ శ్రీధర్ గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ తొలి సంతకం చేస్తామన్నారు. అండర్ గ్రౌండ్ మైన్ లు ఓపెన్ చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్లాడిన అని చెప్పుకున్న వారికి రెండుసార్లు అవకాశం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు. కార్మికుల సమస్యలు కాంగ్రెస్ పరిష్కరిస్తుందని, ఈ దండకారణ్యంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రేవంత్ పేర్కొన్నారు.
Amit Shah: నేడే ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!