పార్టీల మధ్య పోలీస్ అధికారులు నలిగిపోతున్నారా? బండి సంజయ్ ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న చర్చ ఇదేనా? అక్కడ సీపీపై బీజేపీ గురిపెట్టిందా? కమలనాథుల హెచ్చరికలను ఎలా చూడాలి? ఈ అంశంలో టీఆర్‌ఎస్ పోలీస్ కమిషనర్‌ను ఎలా కాపాడుతుంది? సీపీ సత్యనారాయణపై బీజేపీ ఫిర్యాదులు..!కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్ష తలపెట్టడం.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం.. సంజయ్ అరెస్ట్ చకచకా జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకొచ్చారు బండి…
తెలంగాణలో సవాళ్ళ రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌కి సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బీజేపీ పాలితరాష్ట్రాల్లో రైతుబంధు ఉందా? అని ప్రశ్నించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.తెలంగాణలో వ్యవసాయభూములకు భారీగా ధరలు వచ్చాయని, అదే టైంలో ఆంధ్రాలో ధరలు ఢమాల్ అన్నాయన్నారు. ఎర్రిలేసిన కుక్కల్లాగా అర్వింద్, సంజయ్ మాట్లాడుతున్నారన్నారు. దమ్ముంటే కేసీఆర్ ను టచ్ చేసి చూడండి… మా దమ్ము ఏంటో చూపిస్తాం అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రేవంత్ బుడ్డారఖాన్……
తెలంగాణలో ఆ రెండు పార్టీల పంచాయితీలో కాంగ్రెస్ సైడ్ అయిపోయిందా..? రాజకీయ చదరంగంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది ఎవరు..? ఆ రెండు పార్టీల వ్యూహంలో కాంగ్రెస్ పాత్ర ఏంటి? బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యే విమర్శలు.. కాంగ్రెస్ మౌనం..!తెలంగాణ రాజకీయాలు ఒకింత ఆశ్చర్యంగా.. మరికొంత వ్యూహాత్మకంగా నడుస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా పొలిటికల్ వార్ బీజేపీ.. టీఆర్‌ఎస్ మధ్యే సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు మొదలుకుని.. ఉద్యోగుల కేటాయింపు వరకు ఈ రెండు పార్టీల మధ్య గట్టిఫైటే జరుగుతోంది. ఈ…
అసోం సీఎంకి ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్ తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీకి చెందిన జాతీయ నేతలు తెలంగాణకు వచ్చి కేసీఆర్ పాలనపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ చేసిన కామెంట్స్ పై ట్విట్టర్లో స్పందించారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ గొప్ప సంస్కృతి సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం అవడం లేదన్నారు. 2018 ఎన్నికల్లో ఇలాగే…
జైలు నుంచి విడుదలయిన తరువాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు చేశారు. ఈ మాకు జైళ్లు కొత్తకాదు 9సార్లు జైలుకి వెళ్లాను. నేను ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లాను. 317 జీవోను మాత్రం సవరించాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నా అని బండి సంజయ్ అన్నారు. నీ సంగతెంటో తెలుస్తా.. ఉపాధ్యాయులు అందరితో చర్చించు వాళ్ళకి న్యాయం చేయ్ అంటూ కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్…
పైన పటారం..లోన లొటారం. ఆ జిల్లాలో జాతీయపార్టీ తీరు అలాగే ఉందట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని నాయకులు లెక్కలేస్తుంటే.. జిల్లా నేతలు మాత్రం రివర్స్‌లో వెళ్తున్నారట. కుమ్ములాటలతో కాలక్షేపం చేస్తు.. వర్గాలను పెంచిపోషిస్తూ కేడర్‌ను కలవర పెడుతున్నారట. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీలో ఎవరివారే యమునా తీరే..!ఉమ్మడి నల్లగొండ జిల్లా. కామ్రేడ్లు, కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఆయువు పట్టుగా ఉన్న ఈ జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఆధిపత్యం సాధించింది. అలాంటి జిల్లాలో పుంజుకుని.. రాష్ట్రంలో…
తెలంగాణలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ గతంలోలాగే మళ్లీ ఎన్నికల నగారా మోగించనున్నారా? 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లో ఎప్పుడైనా వస్తాయా? అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. సిద్ధంగా ఉండండి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ…
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. రేపు చావుడప్పుల పేరిట బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడం లాంటిదన్నారు. పరిపాలన చేతనవుతాలేదని ఒప్పుకొని అస్త్రసన్యాసం చేసి ముగ్గురం ఉన్నాం మాకు ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో రెండు సంవత్సరాలు నీ కంటే గొప్పగా పాలిస్తామన్నారు. ఇప్పటికైతే చేతనైతే…
ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. తొలిసారి ప్రత్యక్షంగా భేటీ అవుతోంది ప్రస్తుత పాలకమండలి. కౌన్సిల్ మీటింగ్ కోసం బల్దియా ఆఫీస్ లో ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న కౌన్సిల్ భేటీలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. సమావేశం వాడివేడిగా జరగనుంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన భేటీ కానున్న సమావేశంలో కార్పోరేటర్లు, ఎక్స్ అఫిషీయో సభ్యులుగా నగర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. కరోనా కారణంగా గతంలో వర్చువల్ గా…
ఢిల్లీ లో టీ ఆర్ ఎస్ ఎంపీ లు కడుపు లో పేగులు తెగే దాకా కొట్లాడారని, కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు కొట్లాడకున్నా టీ ఆర్ ఎస్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు. వాళ్లు మనుషులా పశువులా? బీజేపీ ఎంపీ పశువులా మమ్మల్ని బియ్యం స్మగ్లర్లు అంటున్నాడు. ఇలాగేనా రాజకీయాలు చేసేది. మేం జవాబు దారీ అంటే అదీ తెలంగాణ ప్రజలకే.. ఢిల్లీ కి గుజరాత్ లకు మేము…