అడకత్తెరలో హస్తం.. డైలమాలో నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఆ రెండు పార్టీల పంచాయితీలో కాంగ్రెస్ సైడ్ అయిపోయిందా..? రాజకీయ చదరంగంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది ఎవరు..? ఆ రెండు పార్టీల వ్యూహంలో కాంగ్రెస్ పాత్ర ఏంటి?
బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యే విమర్శలు.. కాంగ్రెస్ మౌనం..!
తెలంగాణ రాజకీయాలు ఒకింత ఆశ్చర్యంగా.. మరికొంత వ్యూహాత్మకంగా నడుస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా పొలిటికల్ వార్ బీజేపీ.. టీఆర్‌ఎస్ మధ్యే సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు మొదలుకుని.. ఉద్యోగుల కేటాయింపు వరకు ఈ రెండు పార్టీల మధ్య గట్టిఫైటే జరుగుతోంది. ఈ రెండు అంశాలపై కాంగ్రెస్ కొట్లాడుతున్నా.. అధికారపార్టీ కేవలం.. బీజేపీ విమర్శలకే కౌంటర్లు వేస్తోంది. దీంతో చర్చల్లో.. ప్రజల అటెన్షన్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌లే కనిపిస్తున్నాయి. ఇది గమనించిన కాంగ్రెస్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఆ రెండు పార్టీల వ్యూహం నుంచి బయట పడటం ఎలానో తేల్చుకోలేక తలపట్టుకున్నారట నాయకులు.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుమానాలేంటి?
కొంత కాలంగా బీజేపీ…టీఆర్‌ఎస్ రెండూ సమన్వయంతోనే కాంగ్రెస్ పార్టీని సైడ్ చేస్తున్నాయని చర్చ జరుగుతోంది. పార్టీ నాయకులు అదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే పనిలో పడ్డారట. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మొదలుకుని.. మాజీ చీఫ్ ఉత్తమ్ వరకు…కమలం, గులాబీ రెండూ మిత్రపక్షాలుగా చెబుతూ విరుచుకుపడుతున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలే కుమ్మక్కయ్యాయని టీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుండటంతో కేడర్‌కు ఏమీ అర్థం కావడం లేదట. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని అనుమానాలు ఉన్నాయట. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీతోపాటు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిల గ్రాఫ్ తగ్గించడం కోసమే ఆ రెండు పార్టీలు ఎత్తుగడ వేస్తున్నాయని సందేహిస్తున్నారు.
పొలిటికల్ వార్‌లో కాంగ్రెస్‌ను సైడ్ చేస్తున్నాయా?
తెలంగాణలో భవిషత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వ వ్యతిరేకత చీలేలా చేయడం ఒక వ్యూహంగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ.. కాంగ్రెస్ ఎంత చీల్చుకుంటే అంత బెటర్ అనే ఆలోచన టీఆర్‌ఎస్‌లో ఉందట. వ్యతిరేక ఓటు ఒక పార్టీకే వెళ్తే అది రాజకీయంగా ఇబ్బందనే కోణంలో విశ్లేషణలు బయటకొస్తున్నాయి. తెలంగాణలో బలం పెంచుకోవాలని బీజేపీ… అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాలు అమలుచేసే పనిలో ఉన్నయి. కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభలు మొదలుకుని రచ్చబండ.. రైతుల సమస్యలపై ఏ ఉద్యమం చేపట్టినా బీజేపీ, టీఆర్ఎస్‌లు సైలెంట్‌గా ఉంటున్నాయి. ఆ విధంగా పొలిటికల్ వార్‌లో కాంగ్రెస్‌ను సైడ్ చేస్తున్నాయన్నది కొందరి డౌట్. టీఆర్‌ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ విరుచుకుపడినా ఆ రెండుపార్టీల స్పందన లేదు.
సవాళ్లను అధిగమించడమే కాంగ్రెస్‌కు పరీక్ష..!
ఇది కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరకాట పెట్టే ఎత్తుగడా.. లేక భవిష్యత్ లో ఒకరికి ఒకరు చెక్ పెట్టుకుంటారా అన్నది అర్థం కావడం లేదట. ఈ సవాళ్లను అధిగమిస్తూ.. జనాల్లోకి వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారినట్టు గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి.. పొలిటికల్ వార్‌లో హస్తం అడకత్తెరలో పడుతుందో.. అడ్డంకులు అధిగమిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!