తెలంగాణలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రం తీరుని ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన రీతిలో ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్నారు కవిత. రైతులు…
కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉంది, యాసంగి వడ్లను రాష్ట్రం కొనాల్సిందే అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్రం యాసంగికి సంబంధించి రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ఎందుకు వడ్లను కొనం అంటోందని బండి సంజయ్ ప్రశ్నించారు. కామారెడ్డి లోని పర్ణికా హోటల్ లో జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలో పార్టీ జాతీయ సహా కార్యనిర్వాహక కార్యదర్శి శివప్రకాశ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశా నిర్దేశం…
దేశంలో రాజకీయాల గతిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీజేపీ నిరంకుశ విధానాలు, ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై వివిధ రాష్ట్రాల సీఎంల మద్దతు కూడగడుతున్నారు కేసీఆర్. తన పోరును జాతీయ స్థాయికి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే…
కాంగ్రెస్ పిలుపు మేరకు అస్సాం సీఎం పై కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయాల ముట్టడి సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్పు కావాలంటూ కోరుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్పు ఏవిధంగా ఉంటాతో ఈ అక్రమ అరెస్టులు దీనికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రతి భారత పౌరుడికి…
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నియంతగా ఎవరు వ్యవహరించినా ప్రజలు సహించన్నారు. కేసీఆర్ నిజాంల పాలన కొనసాగించాలని… తను ,తన తరవాత కొడుకు, కొడుకు తర్వాత ఆయన కొడుకు అధికారంలో ఉండాలని అనుకుంటున్నారన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 7 ఏళ్లలో ఏమి చేసిందో చర్చించేందుకు సిద్ధం. సీఎం సవాల్ స్వీకరిస్తున్నా అన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కి రేవంత్ కౌంటర్ ఇచ్చారు. “మొసలి కన్నీరు” కార్చడం మీ నాయకత్వ ప్రావీణ్యం.ప్రధాని మోదీ తెలంగాణ తల్లిని, మన అమరవీరుల త్యాగాలను అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను, తెలంగాణ తల్లిని ప్రధాని నరేంద్రమోడీ…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. సర్జికల్ స్ట్రైక్ జరిగినట్లు సాక్షాలు కావాలా? అసలు నువ్వు భారతీయుడివా? అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ సరిహద్దుల గురించి మాట్లాడిన తీరును డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై ఆమె ప్రకటన విడుదల చేశారు. జాతీయ మీడియాలో ప్రచారం కోసం భారత ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీసేలా కేసీఆర్ మాట్లాడడం…
1. ‘అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతా అన్నారు సీఎం కేసీఆర్. ఈ దేశం కోసం ముందు కదలాల్సింది దేశ ప్రజలే. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరు..ప్రజలు కలిసి వస్తే.. నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుంది. కఠోర సమైక్యవాదినన్న చంద్రబాబు జై తెలంగాణ అనలేదా?సమైక్యవాద పార్టీ సీపీఐ జై తెలంగాణ అనలేదా?అన్నారు కేసీఆర్. 2 దేశంలో ఉన్న దళితుల బాగోగుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలంగాణ…
బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతున్నట్టే.. మర్యాదల విషయంలోనూ అదే జరుగుతోంది. కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నాను. సమతామూర్తి కేంద్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. నా శాఖల పౌర సరఫరాలు, పర్యావరణ శాఖలకు సంబంధించి రివ్యూ చేశానన్నారు. ఈ రివ్యూకి అధికారులు మాత్రమే వచ్చారు. రాష్ట్ర మంత్రులు ఎవరూ సమీక్షకు హాజరు కాలేదు. నావిషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. అతిధి మర్యాద ఇవ్వలేదని విమర్శించారు.…
తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా వుంటున్నాయి. బీజేపీ నేతలపై టీఆర్ ఎస్ నేతలు మండిపడుతూనే వున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎంఐఎం పార్టీ తో టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం అని బీజేపీ విమర్శిస్తోంది. మరి ఎంఐఎం అధినేత ఓవైసీ పై కాల్పులు జరిగిన తీరును చూస్తే ఎవరు ఎవరితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారో అర్థమవుతుందన్నారు లక్ష్మారెడ్డి. కర్ణాటకలో జరుగుతున్న హిజ బ్ గొడవ.. ఎక్కడ తెలంగాణ వరకు వ్యాపిస్తుందో…