మాకు జైళ్లు కొత్తకాదు 9 సార్లు జైలుకి వెళ్లా: బండిసంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైలు నుంచి విడుదలయిన తరువాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు చేశారు. ఈ మాకు జైళ్లు కొత్తకాదు 9సార్లు జైలుకి వెళ్లాను. నేను ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లాను. 317 జీవోను మాత్రం సవరించాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నా అని బండి సంజయ్ అన్నారు. నీ సంగతెంటో తెలుస్తా.. ఉపాధ్యాయులు అందరితో చర్చించు వాళ్ళకి న్యాయం చేయ్ అంటూ కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మహిళలపై దాడి చేశారు. కార్యాలయం పైన హేయమైన చర్యకు పూనుకున్నారు. ఉపాధ్యాయులకు మేము అండగా ఉంటాం ఎవ్వరూ భయపడొద్దు. నేను జైలుకి పోయింది వేరు నువ్వు పోయేది వేరని బండి సంజయ్ హెచ్చరించారు.
Read Also: మత్స్యకారులు సామరస్యంతో ఉండాలి: మంత్రి అప్పలరాజు
Also Read
- KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
ఉపాధ్యాయులు ఉద్యోగులు రైతులు కోసం నిరుద్యోగుల కోసం మళ్ళా జైలుకు వెళ్తా అంటూ వ్యాఖ్యానించారు. తూ బతుకు హై కోర్టు ఛీకొట్టింది.నా ఆఫీస్ బద్దలు కొడతావా.. ధర్మం కోసం పనిచేసే వ్యక్తులం మేము. బలి దానాలకు సిద్ధమైన పార్టీ మాది మీలాంటి తుప్పేలు పార్టీ కాదన్నారు. గ్యాస్ కట్టర్లతో ఆఫీస్‌ను బద్ధలు కొడతావా మహిళలపై ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా….? ప్రశ్నిస్తే జైలుకు పంపుతావా..? అవినీతి కుబేరుడు కేసీఆర్ నువ్వు అంటూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. హైకోర్టు నిన్నే తప్పుపట్టింది. విడుదల చేయమన్నా విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తావ్… కేసీఆర్ నీకు కృతజ్ఞతలు నువ్వు ఎంత క్రూరుడివో ప్రజలకు తెలిసింది. దమ్ముంటే ఉద్యోగులతో బయటకు వచ్చి మాట్లాడు.. నీ నీచపు చరిత్రకు చరమగీతం పాడతాం.. అంటూ కేసీఆర్‌ను హెచ్చరించారు. నాకు సహకరించిన జాతీయ నాయకులకు కార్యకర్తలకు అందరికి ధన్యవాదాలు.. తెలంగాణ సమాజానికి ఉపాధ్యాయ ఉద్యోగస్తుల ఆశీస్సులతో ముందుకు వెళ్తాం అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈనెల 10న బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ ఆ బంద్‌ను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!