అసోం సీఎంకి ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీకి చెందిన జాతీయ నేతలు తెలంగాణకు వచ్చి కేసీఆర్ పాలనపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ చేసిన కామెంట్స్ పై ట్విట్టర్లో స్పందించారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ గొప్ప సంస్కృతి సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం అవడం లేదన్నారు.
2018 ఎన్నికల్లో ఇలాగే విర్రవీగుతూ మాట్లాడిన మీ పార్టీ నేతలకు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి, 107 స్థానాల్లో డిపాజిట్ లేకుండా చేశారు. కేవలం ఒక్క స్థానానికే పరిమితం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇప్పటికీ ఎనిమిది ఏళ్ళు కావస్తోంది మీరు సృష్టించిన 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ?? సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ ప్రకారం, భారత్‌లో నిరుద్యోగిత రేటు డిసెంబర్‌లో దాదాపు 8 శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్ (5.3శాతం), మెక్సికో (4.7 శాతం), వియత్నాం (2.3శాతం) లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల కంటే కూడా భారత్‌లో ఈ నిరుద్యోగం రేటు అధికంగా ఉంది.
సీఎం కేసీఆర్ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టుకుంటూ , తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రము దానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మరోసారి తెలంగాణ కు వచ్చినప్పుడు సరైన హోం వర్క్ చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కవిత.
.@himantabiswa Ji, your remarks today once again restated the intent of BJP to erase the glorious history of Telangana. I wonder, why you & your party are so threatened with idea of unity? Did you forget the verdict of Telangana in 2018, where BJP lost deposits on 107 seats.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 9, 2022