వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు NOC సాధించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల కళ నెరవేరబోతుందన్నారు. 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామన్నారు. 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిందని, డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి పౌర విమానయాన శాఖ మంత్రిని కలుస్తామన్నారు.