తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్‌ఎస్ కూడా భగ్గుమంటోంది. టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు మోడీపై ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో…
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి అని దుయ్యబట్టారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. పార్లమెంట్ కు రాని వ్యక్తి మోడీ. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని డ్రామాలు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వు ఏం న్యాయం చేసావో చెప్పు అని ఆయన ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుంది. హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోడీ తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు. సమతామూర్తి కార్యక్రమాల్లో…
ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉన్నారు సీఎం కేసీఆర్. జ్వరం కారణంగా హాజరుకాలేదని పార్టీ, ప్రభుత్వ వర్గాలు తెలిపినా దీని వెనుక కారణాలు వున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొంతకాలంగా ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించి విఫలమవుతున్న సీఎం కేసీఆర్.. ఈ పర్యటన సందర్బంగా మోదీతో ఈ రకంగా వ్యవహరిస్తారించారని అంటున్నారు. మోడీ పేరు చెబితే కేసీఆర్ కు జ్వరం వచ్చిందని సెటైర్లు వేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం…
కేంద్రంపై మరోసారి పోరాటానికి సిద్ధం అవుతోంది టీఆర్ఎస్ పార్టీ.. దానికి పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకోబోతోంది.. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ఎంపీలకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.. పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ…
దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు బండి సంజయ్..హైద్రాబాద్ గల్లీలో కాదని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. ఢీల్లీలో పోరాటం చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తారని హరీష్ రావు అన్నారు. ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేతలు దొంగ జపం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్నారని అసలు…
తెలంగాణలో బలపడేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. రాబోయే రెండేళ్ళు కష్టపడి పనిచేద్దాం అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ అనుబంధ మోర్చాల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్షించిన బండి సంజయ్ పలు సూచనలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’నిర్వహిస్తామన్నారు. వచ్చే నెలలో నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాల కల్పన కోసం ‘కోటి సంతకాల సేకరణ’చేపడతామన్నారు. జనం బీజేపీ పక్షాన ఉన్నారనే భయంతోనే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో అధికార పార్టీ నుండి దాడులు…
తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీపై మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. మేడారం జాతరకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎంపీ బండి సంజయ్ ను ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికీ గర్వకారణం అన్నారు ఎమ్మెల్సీ కవిత. స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ మొత్తం 332.71 కోట్ల రూపాయలను విడుదల చేశారన్నారు. 2014…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. మంత్రి హరీష్ రావు సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతల్ని చెడుగుడు ఆడేస్తుంటారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. 317 జీవో రద్దు అంటే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దు అన్నట్టే అన్నారు మంత్రి హరీష్ రావు. జిల్లాల్లో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీఓ వచ్చింది. ఎవరి మీద పోరాటం చేస్తున్నారో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క లేదు- అందుకే మోడీ వీడియో కాన్ఫిరెన్సు కు హాజరు కాలేదన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుంది. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటాడు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు…
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శల దాడులకు దిగారు. గురువారం శంకర్‌పల్లిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అదానీ, అంబానీల రుణాల మాఫీ కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ ధ్వజమెత్తారు. రైతుల మేలు కోరి తెలంగాణలో ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందన్నారు. మూడు నెలల కాలంలో 50 శాతం ఎరువుల ధరలు పెంచి…