అమిత్ షా నోట ముందస్తు ఎన్నికల మాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ గతంలోలాగే మళ్లీ ఎన్నికల నగారా మోగించనున్నారా? 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లో ఎప్పుడైనా వస్తాయా? అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. సిద్ధంగా ఉండండి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ పర్యాయం కూడా అటువంటి ఆలోచన చేసే అవకాశం లేకపోలేదని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. తాజాగా అమిత్ షా కూడా ముందస్తు ముచ్చట చెప్పడంతో రాజకీయాలు వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో బలమయిన శక్తిగా వున్న టీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కొనేందుకు బీజేపీ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో వ్యతిరేకత చాప కింద నీరులా విస్తరిస్తోందని, ధాన్యం అంశం అందుకు ఉదాహరణ అంటున్నారు. అందుకే మంచి వేడి మీద వున్నప్పుడే ఎన్నికలకు రెడీ కావాలని భావిస్తున్నారు.
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఢిల్లీలో జరిగిన సమావేశంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు బాద్ షా అమిత్ షా. ‘ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ’ అని బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య దోస్తానా వుందని కాంగ్రెస్ ఆరోపణలకు ధీటుగా టీఆర్ఎస్ ఓటు బ్యాంకుని కొల్లగొట్టేందుకు బీజేపీ పక్కా ప్లాన్ వేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ కి గతంలో కంటే తక్కువ సీట్లే వచ్చేలా కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటు బీజేపీని ఇరుకున పెట్టేందుకు వీలున్నప్పుడల్లా మంత్రులతో విమర్శలు చేయిస్తున్నారు. ‘దళితబంధు’ పథకం పైనే కేసీఆర్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ పథకం కేసీఆర్‌కు రాజకీయంగా నష్టం చేస్తుందని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి.
మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభావం కూడా యువతపై వుంటుందని, ఇటీవల బీజేపీలో చేరిన విఠల్, తీన్మార్ మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కమలం వైపు మళ్ళిస్తారని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ అన్నీ ఆలోచించి వచ్చే ఏడాది చివరి నాటికి ఎన్నికలు వెళ్తారని భావిస్తున్నారు. అదే జరిగితే ఈ లోపు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం బీజేపీకి అత్యంత అవసరం. వచ్చే ఏడాది సాధ్యమయినన్ని ఎక్కువసార్లు బీజేపీ సభలు పెట్టి తెలంగాణలో వేడిని రాజేయడానికి సిద్దం అవుతున్నారు బీజేపీ నేతలు. ముచ్చటగా మూడోసారి తెలంగాణ గడ్డమీద గులాబీ జెండా ఎగరేయాలని కేసీఆర్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి బీజేపీ నేతలు ఎలాంటి వ్యూహంతో కారు స్పీడ్‌కి బ్రేక్ లు వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?