Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ali Khamenei: ఇజ్రాయెల్ – అమెరికా సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాదనను బలపరుస్తూ, సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. తన పోస్ట్‌లో ట్రంప్.. ఖమేనీని చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకరిగా అభివర్ణించారు. ఆయన మరణం ఇరాన్ ప్రజలకే కాకుండా, ఆయన హయాంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితులందరికీ లభించిన న్యాయమని వెల్లడించారు. అమెరికా నిఘా సంస్థలు, అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని, ఇజ్రాయెల్‌తో సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతమైందని ట్రంప్ తెలిపారు.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
“ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. తరతరాలుగా మీకు లభించని ఏకైక అవకాశం ఇది. మీ ప్రభుత్వాన్ని మీరు చేతుల్లోకి తీసుకోండి” అని ట్రంప్ ఇరానియన్లకు పిలుపునిచ్చారు. “ఇరాన్ సైన్యం – పోలీసులు దేశభక్తులతో కలిసి శాంతియుతంగా పని చేస్తారని, దేశ వైభవాన్ని పునరుద్ధరిస్తారని మేము ఆశిస్తున్నాము” అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ సైన్యం (IRGC), పోలీస్, ఇతర భద్రతా దళాల్లోని చాలా మంది ఇకపై పోరాడటానికి సిద్ధంగా లేరని, తమకు ఉపశమనం కావాలని కోరుతున్నట్లు సమాచారం ఉందని ట్రంప్ ఈ పోస్ట్‌లో వెల్లడించారు. శాంతి స్థాపన కోసం అవసరమైనంత కాలం ఇరాన్ లోని సైనిక స్థావరాలపై కచ్చితమైన బాంబు దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని ఈ సందర్భంగా అమెరికా స్పష్టం చేసింది. 1979 నుంచి ఇరాన్ అత్యున్నత నిర్ణేతగా ఉన్న ఖమేనీ మరణంతో ఆ దేశంలో నాయకత్వ శూన్యం ఏర్పడిందని చెప్పారు. ఆయనకు సరైన వారసుడు లేకపోవడంతో ఇరాన్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖమేనీ మరణంపై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
"Khamenei, one of the most evil people in History, is dead. This is not only Justice for the people of Iran, but for all Great Americans, and those people from many Countries throughout the World, that have been killed or mutilated by Khamenei…" – President Donald J. Trump pic.twitter.com/oXZTFGg5pS
— The White House (@WhiteHouse) February 28, 2026
READ ALSO: Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..