పార్టీల మధ్య నలుగుతున్న సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీల మధ్య పోలీస్ అధికారులు నలిగిపోతున్నారా? బండి సంజయ్ ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న చర్చ ఇదేనా? అక్కడ సీపీపై బీజేపీ గురిపెట్టిందా? కమలనాథుల హెచ్చరికలను ఎలా చూడాలి? ఈ అంశంలో టీఆర్‌ఎస్ పోలీస్ కమిషనర్‌ను ఎలా కాపాడుతుంది?
సీపీ సత్యనారాయణపై బీజేపీ ఫిర్యాదులు..!
కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్ష తలపెట్టడం.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం.. సంజయ్ అరెస్ట్ చకచకా జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకొచ్చారు బండి సంజయ్. దీక్షకు అనుమతి లేదని బీజేపీ నాయకులకు ముందే చెప్పామన్నది కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వాదన. అయితే CP కావాలనే దీక్షను అడ్డుకున్నారని ఆరోపిస్తోంది బీజేపీ. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై గతంలో ఉన్న కేసులను తిరగదోడారని కాషాయ పార్టీ మండిపడుతోంది. సీపీ సత్యనారాయణపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు సంజయ్.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
దీక్ష భగ్నం సందర్భంగా పోలీసుల తీరుపై బీజేపీ గుర్రు..!
గతంలోనూ సీపీ సత్యనారాయణపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు సంజయ్. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందితే.. అక్కడే ఉన్న తనపై సీపీ జులుం ప్రదర్శించారన్నది బీజేపీ చీఫ్ ఆరోపణ. తాజా ఎపిసోడ్‌లో పోలీసుల తీరు మోతాదు మించిందని కమలనాథులు గుర్రుగా ఉన్నారట. పోలీసులు లాఠీచార్జీతోపాటు మహిళా నాయకులు, కేడర్‌పై దాడులు చేశారని ఆరోపిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు.
రూల్స్ ప్రకారమే దీక్ష భగ్నం.. రాజకీయ కోణం లేదన్న సీపీ
దీక్షను భగ్నం చేసే క్రమంలో పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణచుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ నేతలు చెప్పినట్టుగా CP ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారాయన. ఈ ఆరోపణలపై స్పందించిన సీపీ సత్యనారాయణ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దీక్షను భగ్నం చేశామని.. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని తెలిపారు. అయితే సీపీ సత్యనారాయణపై తప్పకుండా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్, బండి సంజయ్ లాంటి నేతలు ప్రకటనలు చేయడం చర్చగా మారింది.
పార్టీల మధ్య గొడవలతో పోలీసులు నలిగిపోతున్నారా?
పాలకవర్గం చెప్పినవి పోలీసు అధికారులు తూచా తప్పకుండా పాటించడం.. పైనుంచి వచ్చే ఆదేశాలతో ఎలా చెప్తే అలా వ్యవహరించడం నిత్యం జరిగేదే. అది అన్ని ప్రభుత్వాల్లోనూ ఉంది. కాకపోతే పొలిటికల్ పార్టీల మధ్య గొడవలతో పోలీసులు.. ఇతర అధికారులు నలిగిపోతున్నారని.. డిపార్ట్‌మెంట్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే బీజేపీ ఫిర్యాదుల నుంచి సీపీ సత్యనారాయణను టీఆర్ఎస్ సర్కార్ ఎలా కాపాడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!