Janasena: డీలిమిటేషన్ పై చెన్నై వేదికగా అఖిలపక్షం సమావేశమైంది.. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన.. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్‌లో ఈ భేటీ కాగా.. పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు పాల్గొన్నారు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపి రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్.. అయితే, ఈ సమావేశానికి జనసేన నేతలు కూడా హాజరైనట్టు ప్రచారం జరిగింది.. దీనిపై స్పందించిన ఆ పార్టీ కేంద్ర కార్యాలయం.. క్లారిటీ ఇచ్చింది.. అసలు ఈ సమావేశానికి ఎందుకు హాజరుకాలేదన్న దానిపై జనసేన క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది..
Read Also: WhatsApp : భారత్‌లో 99.67 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్.. మీ అకౌంట్స్ జాగ్రత్త!
నియోజకవర్గాల పునర్విభజనపై ఆహ్వానం వచ్చింది.. కానీ, హాజరు కాలేమని సమాచారం ఇచ్చామని జనసేన ప్రకటించింది.. చెన్నైలో డీఎంకే.. నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది.. అయితే, హాజరుకాలేమని సమాచారం అందించామని పేర్కొంది.. ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే.. ఈ సమావేశంలో పాల్గొనాలని డీఎంకే తరఫున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారు.. వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియజేయాలని.. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.. ఆ మేరకు డీఎంకేకు సమాచారం ఇచ్చాం.. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయలు వారికి ఉన్నట్టే – ఈ అంశంపై మా విధానం కూడా ఉంది.. ఈ విషయమై మా విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది జనసేన కేంద్ర కార్యాలయం.