Minister Nara Lokesh: ప్రభుత్వం శాశ్వతం.. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం అని ఇప్పటికైనా తెలుసుకోండి జగన్ రెడ్డి అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వం మారినా.. అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీ విధ్వంసపాలనతో బ్రేక్ చేశారు.. 2019లో అధికారంలోకి వచ్చిన మీరు గత ప్రభుత్వ బకాయిలు మేమెందుకు చెల్లించాలి అంటూ మొండికేశారు.. టీడీపీ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులను నిలిపేశారు.. మరికొన్ని ధ్వంసం చేశారు.. ఈ నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. మేము అధికారంలోకి వచ్చామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
Read Also: Shashi Tharoor: మొదట ప్రధానిపై ప్రశంసలు.. ఇప్పుడు బీజేపీ ఎంపీతో సెల్ఫీ
ఇక, మా విద్యాశాఖలో మీరు పెట్టి వెళ్లిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.4271 కోట్లు.. ఇవి విడతల వారీ చెల్లిస్తామని మాట ఇచ్చాను.. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.788 కోట్లు విడుదల చేసిన మా ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసిందని అన్నారు. అయితే, త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మీరు పెట్టిన బకాయిలు ఆర్థిక భారంగా మారినా, చివరి రూపాయి వరకూ బకాయిలు చెల్లించడం, విద్యార్థులు, తల్లిదండ్రులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయడమే మా బాధ్యతగా భావిస్తున్నామని నారా లోకేశ్ వెల్లడించారు.