Deputy CM Pawan: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మండలం పూడిచెర్ల వద్ద నీటిగుంట పనులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షా 55 వేల నీటి కుంటలు మే ఆఖరులోగా లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం.. రాయలసీమ రతనాల సీమ కావాలి.. అభివృద్ధి కొందరికే కాకుండా అందరికి కావాలని తెలిపారు. ఒకే రోజు 13,320 గ్రామ సభలు నిర్వహించాం.. అభివృద్ధిలో చంద్రబాబు నాయకత్వంలో ముందడుగు వేస్తున్నాం.. 16 వేల కోట్లతో 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించాం.. ఇజ్రాయెల్ ప్రపంచానికే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇచ్చింది.. నీటి కుంటలు సద్వినియోగం చేసుకుంటే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు వినియోగించుకోవాలి.. నా ఫారంలో నీతికుంటలు తవ్వుకున్నాను.. పాలేకర్ వ్యవసాయ విధానం అనుసరించాలి.. ఓజిలో హీరోలా కాకుండా సగటు రైతులా మాట్లాడుతున్నారు.. ఉపాధి దొరక్కపోతే, సినిమాల్లో ఛాన్స్ ఇవ్వకుంటే నేను నర్సరీలో పని చేయాలనుకున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: IPL : ఐపీల్ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న బాలీవుడ్.. కారణం ఏంటంటే.?
ఇక, రైతు కష్టపడతాడు, సరైన వనరులు ఉపయోగించుకోకుంటే కష్టం వృథా అవుతుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. నేను హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన ఇతర మతాలు ఇబ్బంది పడేలా మాట్లాడను.. అసమానతలను వెతుక్కోను, అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటా.. సనాతన ధర్మాన్ని పటిస్తాను, అన్ని మతాలను గౌరవిస్తా అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కర్నూలు ఎయిర్ పోర్ట్ కి ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పేరు పేరు పెడతామన్నారు. ఇక, బుడగ జంగాలకు కుల సర్టిఫికెట్ ఇవ్వడం లేదు.. అసెంబ్లీలో కూడా ప్రస్తావించాను.. త్వరలోనే వారికి న్యాయం చేస్తాను అని వెల్లడించారు. నందికొట్కూరు నియోజకవర్గం కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలో చెప్పాను.. నా ట్రస్ట్ ద్వారా రూ.50 లక్షలు ఇస్తా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కొణిదెల గ్రామంలో అమలు చేస్తా.. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తా.. టెంట్ వేసి అక్కడే రెండు మూడు రోజులు ఉంటాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.