YS Jagan: డీలిమిటేషన్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. దక్షణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో తగ్గింపు లేకుండా చూడాలని లేఖలో ప్రధానిని కోరారు. 2026లో జరిగే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన ఉంది.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ ఆందోళన కలిగిస్తోంది.. గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గింది.. గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు మేరకు ఈ తగ్గుదల కనిపించింది.. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం డిలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు భాగస్వామ్యం తగ్గుతుంది.. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలి అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Karthi : ఆరు సినిమాలతో క్రేజీ లైనప్ సెట్ చేస్తున్న యంగ్ హీరో..
అయితే, పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అందుకే దక్షిణాదిన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని చెప్పారు. ఇక, అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది అని తెలిపారు. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నాను అని జగన్ లేఖలో వెల్లడించారు.