Cancer: ఒకే గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అనుమానాలు ఇప్పుడు జలభద్రపురాన్ని వణికిస్తున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు కలకలం సృష్టిస్తున్నారు.. గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ గ్రామాన్ని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడాలంటూ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించారు స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ఇక, క్యాన్సర్ కేసులపై అప్రమత్తమైన తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.. ఇవాళ గ్రామంలో 31 బృందాలతో ఇంటింటి ఆరోగ్య సర్వే, గ్రామస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు..
Read Also: Delimitation: తొలి ‘‘డీలిమిటేషన్’’ సమావేశంలో 7-పాయింట్ల తీర్మానం.. అవి ఏంటంటే..
బలభద్రపురం గ్రామంలో సుమారు పదివేల వరకు జనాభా నివాసం ఉంటున్నారు.. ఇప్పటికే 23 మంది క్యాన్సర్ చికిత్స తీసుకున్నట్లుగా గుర్తించామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు.. అయితే, స్థానికంగా వాతావరణం కాలుష్యం కావడం.. నీరు, గాలి.. ఇలా అన్నీ కలుషితం కావడంతో.. గ్రామస్తులకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.. బలభద్రపురం సమీపంలో ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తో పాటు ఇతర పరిశ్రమల మూలంగా.. గాలి, నీరు కాలుష్యం అవుతున్నాయని.. దాని కారణంగా వందలాది మంది క్యాన్సర్ బారినపడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.. ఇప్పటికే వందలాది మంది క్యాన్సర్ బారినపడ్డారు.. మరికొంత మందికి దాని బారిన పడకుండా.. కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదేనని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు.. అయితే, బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభణ తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. మృతులపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్న లెక్కలు సరికాదన్నారు.. పీహెచ్‌సీలకు వచ్చిన కేసుల ఆధారంగా అధికారులు లెక్కలు చెబుతున్నారు.. అసలు క్యాన్సర్ రోగులు పీహెచ్‌సీలకు ఎందుకొస్తారు? అని ప్రశ్నించారు.. అయితే, ఏడాది కాలంలో ఆ ఊరిలో క్యాన్సర్‌తో చనిపోయిన వారి దాదాపు 15 మంది కుటుంబాల్ని తానే పరామర్శించేందుకు వెళ్లానని ఎమ్మెల్యే చెబుతున్నారు.