Drugs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈగల్ టీం దాడుల్లో ఐసీస్ డ్రగ్ కలకలం రేపింది. ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్ అమ్మకాలను గుర్తించిన అధికారులు షాక్ అయ్యారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఉన్న భార్గవ్ మెడికల్ షాప్ లో ఈ ఐసిస్ డ్రగ్స్ ను గుర్తించారు. ఐసిస్, బోకో హారం లాంటి ఉగ్రవాద సంస్థలు ఐసిస్ డ్రగ్స్ గా వినియోగించే ట్రేమడాల్ అనే సైకో ట్రోపిక్ సబ్ స్టెన్స్ (మాదక ద్రవ్యం) అనుమతి లేకుండా అమ్ముతున్నట్టు నిర్ధారించారు. గత రెండేళ్ల కాలంలో 55, 961 ట్రేమ డాల్ మాత్రలు, 2,794 ఇంజక్షన్లు అనుమతి లేకుండా అమ్మినట్టు పేర్కొన్నారు. 2022 -2023, 2023 – 2024 సమయంలో ఈ అమ్మకాలు జరిగినట్టు గుర్తించారు.
Read Also: Currency Case: బయటకొస్తున్న జడ్జి యశ్వంత్ వర్మ మోసాలు.. వెలుగులోకి సీబీఐ కేసు
అలాగే, ఈ ఐసిస్ డ్రగ్స్ దందా ర్యాకెట్ ను నడుపుతున్న భార్గవ్ మెడికల్ స్టోర్స్ పై కేసు నమోదు చేశారు. ఐసిస్, బోకో హారామ్ లాంటి ఉగ్రవాద సంస్థలు.. ఉగ్రవాదులకు నిద్ర రాకుండా, ఎక్కువ సేపు ఉత్తేజంగా ఉండటానికి ఈ ట్రేమా డాల్ టాబ్లెట్స్ ఇస్తాయని విచారణలో నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఐసీస్ డ్రగ్ ను ఫైటర్ డ్రగ్ గా పిలుస్తారని అధికారులు చెబుతున్నారు. చాన్నాళ్లుగా ఈ టాబ్లెట్స్, ఇంజక్షన్లను ఆమ్ముతున్నట్టు విచారణ అధికారులకు తెలిపిన యజమాని కొనకళ్ళ రామ్మోహన్.