Kollu Ravindra: మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. పీడీఎస్ కేసు నమోదు కావడంతో మూడు నెలలు తండ్రి కొడుకు అడ్రస్ లేకుండా పోయారు.
Kakani Govardhan Reddy: మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అన్నారు.
Bhupathi Raju Srinivasa Varma: కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పార్లమెంట్ నుంచి సాయంత్రం తన మంత్రిత్వ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రి ప్రయాణిస్తున్న కారును మరో ప్రభుత్వ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు అయింది. కారు ఇంజన్ సీజ్ అయినట్లు తెలుస్తోంది.
Union Minister Srinivasa Varma: ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగా అవతరించడం ఆనందంగా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.
Jethwani Case: ముంబై నటి కాదంబరీ జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Nimmala Rama Naidu: ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్ట్ కు నేటికి రూ. 5052 కోట్ల నిధులు అడ్వాన్స్ గా రావడం జరిగింది అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
Minister Satya Kumar: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికలో ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను కూడా భ్రష్టు పట్టించారు అని ఆరోపించారు.
Vijayasai Reddy: వైసీపీకి రాజీనామా చేయటంపై మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉంది.. దాని వల్లే నేను జగన్ కు దూరం అయ్యాను.. ఆయన మనసులో నాకు స్థానం లేదు అని తెలిసింది.. ఆ విషయం తెలిసి నా మనసు విరిగింది.. అందుకే పార్టీ నుంచి వెళ్లి పోతున్నాను అని నేను జగన్ కు చెప్పాను.
ఎండాకాలం రానే వచ్చింది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బుధవారం (12-03-25) కృష్ణా జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాలు,…
Off The Record: ఆ మంత్రి ఎమ్మెల్యే ఇగోని టచ్ చేశారా? అందుకే.... మంత్రి అయితే ఏంది? ఎవడైతే నాకేంటి...? నా రాజకీయం నాది, నా అవసరాలు నావంటూ.... ఓపెన్గానే ఫైరై పోయారా? ఎమ్మెల్యే ఇచ్చిన షాక్తో అవాక్కయిన మంత్రి తేరుకోవడానికి కాస్త టైం పట్టిందా? వ్యవహారం అంతదూరం వెళ్తుందని ఊహించలేకపోయిన ఆ మంత్రి ఎవరు? ఆయనకు ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎవరు?.