YS Viveka Case: హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై.. వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై
- వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- లేఖ గురించి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కి చెప్పానని తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఆయన పీఏ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకా హత్య జరిగిన రోజు అక్కడ దొరికిన లేఖ గురించి వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి కీలక విషయాలను బయటపెట్టారు. లేఖ గురించి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కి చెప్పానని తెలిపారు. లేఖ దాచిపెట్టమని రాజశేఖరరెడ్డి తనకు చెప్పాడని వెల్లడించాడు. లేఖ దాచిపెడితే పోలీసులు నుండి సమస్య వస్తుందని ఆ రోజు చెప్పానని అన్నారు. నేను చెప్పింది చెయ్ అని రాజశేఖర్ నాతో చెప్పాడని తెలిపాడు. నన్ను కేసులో ఇరికించి రాజశేఖర్ బయట ఉన్నాడని వెల్లడించాడు.
Also Read:Punjab: ‘‘ పాకిస్తాన్‌లో నివసిస్తున్నట్లు ఉంది’’.. సొంత ప్రభుత్వంపై ఆప్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..
Also Read
ఎంపీ అవినాష్ రెడ్డి డైరెక్షన్ లో ఎవరు నడవట్లేదు.. సిబిఐ విచారణకు డిల్లీ వెళ్ళాలని రాజశేఖర్ సిబిఐ అదికారులకు కంటే ముందే చెప్పాడని వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపాడు. డిల్లీలో విచారణ ఉంటుందని సిబిఐ కంటే ముందే రాజశేఖర్ ఎలా చెప్పాడని ప్రశ్నించాడు. సిబిఐ ఏం చెప్తుందో రాజశేఖర్ కు ముందే ఎలా తెలుసని అన్నారు. డిల్లీలో సిబిఐ విచారణకు రాజశేఖర్ నాకు ప్లైట్ టికెట్స్ బుక్ చేశాడు.
Also Read:Airtel: దేశవ్యాప్తంగా 2000 నగరాల్లో IPTV సేవలు తీసుకరానున్న ఎయిర్‌టెల్.. ప్లాన్స్ లిస్ట్ ఇదే!
నన్ను ఢిల్లీకి పంపించిన వ్యక్తులు ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.. సాక్షాదారాలతో సహా నేను మీడియా ముందు చూపిస్తున్నాను ఇవి అవాస్తవాలని మీరు నిరూపించగలరా.. అని ప్రశ్నించాడు. నా భద్రత కోసం గతంలో ఎస్పీని కూడా కలిశాను నా వెపన్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు.. రెండు సంవత్సరాలు న్యాయస్థానం కూడా పట్టించుకోలేదు.. నా కొడుకు రాజేష్ ను చిత్రహింసలకు గురి చేశారు.. సహకరించకపోతే నువ్వు జైలుకు పోతావు అంటూ సునీత బెదిరించిందని వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపాడు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!