ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గతంలో చంద్రబాబు 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే, జగన్ విధ్వంసం చేశాడు. జగన్ నిర్వాహకం వల్ల కొత్తగా రూ. 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తోంది. గత ఐదేళ్లు పోలవరం ఆలస్యం కావడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా రూ. 50 వేల కోట్లు నష్టపోయాం.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి రూ. 12,157 కోట్ల రూపాయలు నిధులు సాధించారు.
Also Read:Divorce: యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ విడాకుల వెనుక అసలు కారణం అదేనట!
చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్ట్ కు, నేటికి రూ. 5052 కోట్ల నిధులు అడ్వాన్స్ గా రావడం జరిగింది. నాడు జగన్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన పోలవరం రీయింబర్స్ మెంట్ నిధులను సైతం దారిమళ్లించి ప్రాజెక్ట్ ను విధ్వంసం చేసింది.. నేడు డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు, పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయి.. అంతర్జాతీయ నిపుణుల కమిటీ, CWC, PPA, లను ఎప్పటికప్పుడు సమన్వయపరచుకుంటూ 2027 డిసెంబర్ కు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసేలా, డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నాం” అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.