* నేడు సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. పోలవరం ప్రాజెక్ట్.. డయాఫ్రమ్ వాల్ పరిశీలన.. భూసేకరణ, పునరావాసంపై సమీక్ష చేయనున్న చంద్రబాబు..
* నేడు ఉదయం 10 గంటలకి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం.. సభలో కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి.. డీలిమిటేషన్ పై ప్రభుత్వ తీర్మానం ప్రవేశ పెట్టనున్న సీఎం రేవంత్..
* నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న సభ..
* నేడు చంద్రగిరిలో ఎంపీపీ, ఉప సర్పంచుల ఎన్నిక.. తిరుపతి రూరల్ ఎంపీపీతో పాటు రామిరెడ్డిపల్లి, చింతగుంట ఉపసర్పంచ్ స్థానాలకు ఎన్నిక..
* నేడు రేణిగుంట ఎయిర్ పోర్టుకు 33 మంది వైసీపీ ఎంపీటీసీలు.. ఎంపీపీ అభ్యర్థిగా బాబును ప్రకటించిన వైసీపీ..
* నేడు కడప జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక.. ఇప్పటికే క్యాంప్ లో ఉన్న వైసీపీ జెడ్పీటీసీలు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పిన కోర్టు..
* నేడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ అమలు.. జిల్లాలో ఎంపీపీ, ఉప సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల చర్యలు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..
* నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు.. ఉత్సవమూర్తులకు రాత్రి 7గంటలకు గ్రామోత్సవం..
* నేటి నుంచి అక్కినేని శత జయంతి ఉత్సవాలు.. హైదరాబాద్ లోని అమీర్ పేటలో 30వ తేదీ వరకు ఉత్సవాలు.. ఆంధ్రనాటక కళాపరిషత్ జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా.. పద్మవిభూషన్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు..
* నేడు ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్..
* నేడు హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు.. ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్..