ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా ప్రగతి ప్రణాళికలకు సంబంధించి సీఎం నారా చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 124 ఎకరాల భూమిని పారిశ్రామిక అభివృద్ధికై ఏపీఐఐసీ కేటాయించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.28 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది.. చిత్తూరు జిల్లాలో 3.65 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా లైవ్ స్టాక్ ప్రాజెక్టు అమలుకై ప్రతిపాదించడంపై అభినందనలు తెలిపారు.
Also Read:Ravishankar : ఆ సీన్ లో రామ్ చరణ్ ను చూస్తే మైండ్ పోతుందిః నిర్మాత రవిశంకర్
ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద మొత్తంలో సంపదను సృష్టించి చిట్ట చివరి నిరుపేద వరకు ఆ సంపదను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే తరహా లైవ్ ప్రాజెక్ట్ ను అన్ని జిల్లాల్లో ప్రతిపాదిస్తూ సంపదను సృష్టించడమే కాకుండా ఆ సంపద చిట్ట చివరి నిరుపేద వరకు అందేలా చూడాలి.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో వృద్ధి నైపుణ్యాన్ని పెంచే ఆన్‌లైన్ ఆఫ్ లైన్ కోర్సులను నిర్వహించాలి.. ఇందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఐదు జోన్ల వారీగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల ద్వారా ఈ వృత్తి నైపుణ్యం కోర్సులు నిర్వహించాలని సూచించారు.
Also Read:Robinhood : భీష్మ కంటే రాబిన్ హుడ్ బెస్ట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందిః నితిన్
అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళా నిర్వహించాలి.. తిరుపతి జిల్లాలో కడప – రేణిగుంట, పీలేరు- కాలేరు జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన ఫారెస్ట్, ఎన్ హెచ్ ఐ క్లియరెన్స్ లను సత్వరమే ఇవ్వాలి.. అన్నమయ్య జిల్లాలో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఎన్ఆర్ఈజిఎస్ ప్రాజెక్ట్ కింద 4,319 హెక్టార్లలో హార్టికల్చర్ ప్రాజెక్టు అమల్లో భాగంగా మామిడి తోట్ల పెంపకము, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అమలుకు ఆమోదం.. అయోధ్యలో చాలామంది భూములు కొనుక్కొని సెటిల్ అవుతున్నారని, అదే తరహాలో తిరుపతి డివైన్ ప్లేస్ గా అభివృద్ధి పరచాలి. ప్రకాశం జిల్లా 19.46% , నెల్లూరు జిల్లా 14.45%, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు 13.22%, తిరుపతి 12.08% గ్రోత్ రేట్ సాధన లో వరుసగా నిలిచాయని సీఎం తెలిపారు.