రేపు కాకినాడ రూరల్ ఎంపీపీ స్థానానికి ఎన్నిక జరుగనున్నది. కాకినాడ రూరల్ మండలంలో 18 ఎంపీటీసి స్థానాలు ఉన్నాయి. 2021 లో జరిగిన ఎన్నికల్లో 15 స్థానాల్లో వైసిపి, మూడు స్థానాలు జనసేన గెలుపొందాయి. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఎంపీపీ రాజీనామా చేశారు. తాజాగా ఏడుగురు వైసిపి ఎంపీటీసీలు జనసేనలో చేరారు. దీంతో మండల పరిషత్ లో జనసేన బలం పదికి చేరింది. తమకు మద్దతు ఇస్తున్న పదిమంది ఎంపీటీసీలతో ఎమ్మెల్యే కుమారుడు సందీప్ లంబసింగిలో క్యాంప్ పెట్టాడు. రేపు డైరెక్ట్ గా మండల పరిషత్ కార్యాలయానికి ఎంపీటీసీలు వచ్చి ఓటింగ్ లో పాల్గొననున్నారు.