విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్మీడియట్లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, వివిధ సంస్థల ప్రతిపాదనలపై చర్చ జరిగింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) 4వ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో 10 సంస్థలకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో ఇంధన శాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఒకప్పుడు ఉండేదని ఆరోపించారు. తాను పాదయాత్ర చేసినపుడు కొన్ని సంఘటనలు తనను కలిచి వేశాయన్నారు. ప్రస్తుతం 9 గంటలు రైతులకు నిర్విరామంగా కరెంట్ ఇస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు.
విజయనగరం జిల్లాలో ఓ హెచ్ఎం విద్యార్థులకు స్టేజ్ పై నుంచి సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి.. క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరో కీలక చట్ట సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది.. ఏపీ భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.. అప్పిలేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్డీవోలకు మారుస్తూ చట్టసవరణ చేశారు... చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.. వల్లభనేని వంశీ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.. బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు వంశీ తరుపున న్యాయవాది సత్య శ్రీ.. ఇక, ఈ కేసుకు వంశీకు ఎలాంటి సంబంధంలేదని కూడా వాదించారు..
విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్.. విజయసాయిరెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించిన ఆయన.. మొన్నటి వరకు సాయిరెడ్డి చెప్పిన పూజారుల్లో ఆయన ఒకరు కదా...? అని ప్రశ్నించారు.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత వ్యవసాయం కాదు రాజకీయం చేస్తారనేది అర్థం అయ్యింది... జగన్మోహన్ రెడ్డి కోటరీ అంటే వైసీపీ కార్యకర్తలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీలో కోటరీ ఉండదో చెప్పాలి..
కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్ బృందం.. అయితే, సిట్ నిర్ణయంతో టీటీడీ అధికారులో ఆందోళన మొదలైంది.. మార్కెటింగ్ విభాగంలో పనిచేసి ఆక్రమాలుకు పాల్పడిన అధికారులుపై చర్యలకు సిద్ధం అవుతోంది సిట్.. కల్తీ నెయ్యి కేసు విచారణను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ సిట్ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో పిటిషన్ వేశారు..