ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశాలు జరిగాయి. నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “అమరావతి తిరుపతి వైజాగ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు కోసం ప్రత్యేక కల్చర్ సెంటర్ ఉండాలి.. కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.. సంస్కృతిని నిరంతరం ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి.. సమస్యల పరిష్కారం కోసం మనం ఉన్నాము.. అంతే కాని అడిగినప్పుడు సమస్యలు చెప్పడం కాదు.. జిల్లాలో సమస్య వస్తే ప్లానింగ్ బోర్డ్ స్పందించాలి.. అవసరం అయితే సిఎమ్ఓ ను సంప్రదించాలి. కేంద్రానికి కూడా కొన్ని లిమిట్స్ ఉండాలి.. అభివృద్ధి చెయ్యకపోతే ఆదాయం రాదు.. సంక్షేమం చెయ్యకపోతే ప్రజల్లో అసహనం వస్తుందన్నారు.
Also Read:David Warner : ఆ బూతులు వింటే మీరు చెవులు మూసుకుంటారు.. వార్నర్ రియాక్షన్
9 లక్షలకు పైగా అప్పు ఉంది.. ఒక పక్క నమ్మకం కాపాడుకుంటూ అప్పులు తీర్చాలి.. హార్డ్ వర్క్ పరిష్కారం కాదు.. నేను పరిగెత్తి మిమ్మల్ని పరిగెత్తిస్తా.. అప్పుడే ఫలితాలు వస్తాయి. ప్రజలు మెచ్చుకునే విధంగా సమస్యలు పరిష్కారం కావాలి. ప్రతి కలెక్టర్ కు టూరిజంకు సంబంధించి టార్గెట్స్ ఉన్నాయి.. టూరిజంలో ఏజ్ ల వారీగా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చెయ్యడంపై దృష్టి పెట్టాలి.. ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో కాకుండా సిటీలో ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు.
Also Read:Bihar: లాలూ ప్రసాద్ యాదవ్‌కు భారతరత్న.. తిరస్కరించిన బీహార్ అసెంబ్లీ..
టూరిజం పాలసికి ప్రాధాన్యత ఇచ్చి కొత్త ప్రాజెక్ట్ లు తేవాలి.. 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. ఎక్కడా వేధింపులు ఉండరాదు.. నాలా చట్టం రద్దు చేస్తున్నాం.. నాలా వల్ల లేఅవుట్ లు ఆలస్యం అయ్యి అవినీతి కి కేరాఫ్ గా మారింది.. ఆక్వా రైతులకు యూనిట్ 1.50 పైసలకే విద్యుత్ ఇస్తున్నాం.. కలెక్టర్ లు ఎస్పీలు కలిసి లా అండ్ ఆర్డర్ పై సమీక్ష చెయ్యాలి.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో కలెక్టర్లు కలిసి రావాలి.. మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ కలుద్దాం” అని సీఎం తెలిపారు.