శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి బరిలోకి దిగిన ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. అయితే ఈ సందర్భంగా.. తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు నాగబాబు.. నా బాధ్యతను పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి కృతజ్ఞతలు తెలిపారు..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి, కలిదిండి, ముదినేపల్లిలో పెద్ద ఎత్తున ఇసుక ఉండటంతో ఈ ప్రాంతం నుండి లారీలతో బుసక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈవో శ్రీన్నవాసరవు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.. శ్రీసామి అమ్మవారి మహా మంగళహారతుల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఎక్కించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు..
యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 12 గంటలకు నిర్వహించిన స్వామి వారి కల్యాణమహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు.
జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో పండగ వాతావరణంలో చేయడానికి ఏర్పాటు చేస్తోంది ఆ పార్టీ.. శాసనసభ్యులు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఇవాళ్టి సభను సక్సెస్ చేయడంలో బిజీగా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో జయకేతనం సభ గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ (BC)లకు శుభవార్త చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్లు వేసిన వారిలో కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు ఏకగ్రీవం అయ్యారు. అలాగే.. బీజేపీ నుంచి సోము వీర్రాజు, జనసేన నుంచి నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉమెన్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇప్పటి వరకు ఉండేది.. ఇప్పుడు ఐజీ నేతృత్వంలో ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.