Deputy CM Pawan Kalyan: పిఠాపురం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇకపై వరుసగా సమీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పేషి అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో ఈ రోజు నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు పవన్. అధికారులతో రివ్యూలో కీలక సూచలను చేశారు.. పిఠాపురం నియోజక వర్గ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు.. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల మూలంగా పోలీస్ శాఖ చులకన అవుతోందన్న ఆయన.. ప్రతివారం పిఠాపురం అభివృద్ధిపై సమీక్ష చేస్తానని తెలిపారు.
Read Also: Kollywood Actress : స్టార్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. చివరకు ట్విస్ట్..
అధికారులు క్షేత్ర స్థాయిలో పురోగతిని పరిశీలించాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్.. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆయన.. వేసవిలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండ కూడదు.. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్స్ దగ్గర తనిఖీలు చేయాలన్నారు. అమృత్ 2.0 ద్వారా పిఠాపురం పట్టణంలో తాగు నీటి సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే పురపాలక శాఖ అధికారులతో సమీక్ష చేశాను.. పిఠాపురం – ఉప్పాడ రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలిగాం.. రూ.59.7 కోట్లు నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.. ఇక, ఉపాధి హామీ పథకంలో రూ.40.2 కోట్లతో 444 రోడ్డు పనులు చేపట్టాం.. 431 గోకులాలు పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చాం.. పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని సీహెచ్‌సీ నుంచి ఏరియా ఆసుపత్రి స్థాయికి పెంచాం.. అందుకు అనుగుణంగా రూ.38.32 కోట్లు నిధులు వచ్చాయని సమీక్ష సమావేశంలో వెల్లడించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..