* నేడు చెన్నైకు ఏపీ సీఎం చంద్రబాబు.. చెన్నై ఐఐటీలో ఓ కాంక్లేవ్ లో పాల్గొననున్న సీఎం..
* నేడు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఏఐసీసీ డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశానికి హాజరుకానున్న భట్టి.. ఇటీవల ఏఐసీసీ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడిగా భట్టి నియామకం..
* నేడు వక్ఫ్ సవరణకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన.. మక్కా మసీద్ ప్రాంగణంలో సభ ఏర్పాటు చేసిన ఎంఐఎం.. దేశవ్యాప్తంగా నల్ల బ్యాడ్జిలు ధరించి నమాజ్ కి వెళ్లాలన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు.. పాతబస్తీలో భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు..
* నేడు నరసరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నిక.. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా..
* నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి ఎంపీపీ ఎన్నిక.. వైసీపీ ఎంపీటీసీలు రాకపోవడంతో నిన్న వాయిదా..
* నేడు అత్తిలి ఎంపీపీ ఎన్నిక.. ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న వాయిదా వేసిన అధికారులు..
* నేటి నుంచి తెలంగాణలో పెరగనున్న ఎండలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న వడగాలుల తీవ్రత..
* నేడు ఏపీలోని 89 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 105 ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా నమోదు..
* నేడు రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో శ్రీరామ కోటి తలంబ్రాల గులాబీలు అర్చన.. కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న అర్చన..
* నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం..
* నేటి నుంచి కర్ణాటకలో పాల ధరలు పెంపు..
* నేడు ఐపీఎల్ లో సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య పోరు.. రాత్రి 7.30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్..