CM Chandrababu: పోలవరం నాకొక సెంటిమెంట్.. ప్రాజెక్టు విషయంలో ఎక్కువ బాధ పడేది నేనే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ఆయన నిర్వాసితులతో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచి పెట్టకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తాం.. తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
Read Also: Deputy CM Pawan Kalyan: పిఠాపురంపై పవన్ కల్యాణ్ రివ్యూ.. కీలక సూచనలు
పోలవరం పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం నిర్వాసితులతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 4,311 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. 2019లో వచ్చిన ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీ గురించి ఆలోచించడం కానీ, పట్టించుకోవడం కానీ చేయలేదని… కనీసం మీ సమస్యల పట్ల ఆలోచించిన దాఖలాలు కూడా లేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల అకౌంట్లలో 829 కోట్లు జమ చేశామని తెలిపారు.. 2019లో తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండుంటే 2020కి ప్రాజెక్టు పూర్తయ్యేదని.. ఆలస్యం చేయడం వల్ల ఖర్చు భారీగా పెరిగిపోయాందని తెలిపారు.. 400 కోట్లతో డయాఫ్రం వాల్ కడితే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిందని.. ఇప్పుడు మళ్లీ .990 కోట్లతో కొత్త డయాఫ్రంవాల్ నిర్మిస్తున్నాం అని వెల్లడించారు.
Read Also: Kannappa: అంత నమ్మకం ఉంటే ఈ శాపాలెందుకు?
2027 నాటికి పునరావాసాలు పూర్తి చేస్తామని.. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. కొందరి పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారు… విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.. పునరావాసం కల్పించిన తర్వాత మీ ఆదాయ మార్గాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. వందేళ్లలో రెండువేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్ళింది.. 1940లో ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించారు.. అది సాధ్యం కాక ధవళేశ్వరం కట్టారు.. 2004లో పనులు ప్రారంభం అయిన లిటిగేషన్ లో పడింది.. విభన చట్టంలో పోలవరం అంశం ఉండటం తో నిర్మాణం సాధ్యం అవుతుందని నమ్మకం వచ్చింది.. కేంద్రం అపుడు ఇప్పుడు చాలా సాయం అందించింది.. 2019నాటికి 73శాతం పనులు పూర్తి చేశాం.. గిన్నీస్ రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులు చేశాం.. 22 సార్లు నేరుగా, 88 సార్లు వర్చువల్ గా ప్రాజెక్టు రివ్యూలు చేశాం.. కానీ, ఇపుడు ప్రాజెక్టు చూస్తుంటే బాధగా ఉంటుంది.. ఎలా ఉండాల్సిన ప్రాజెక్టు ఎలా తయారు చేశారు.. తెలియని తనం, అహంభావంతో ప్రాజెక్టు సర్వ నాశనం చేశారని ఫైర్ అయ్యారు..