ఏపీ శాసన మండలి సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. వైసీపీ సభ్యులు ప్రతిరోజు అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీకి, పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్ మోషేను రాజును కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన పదవీకాలం 2029 వరకు ఉంది. ఈ సందర్భంగా గతంలో రాజీనామా చేసిన నలుగురు సభ్యుల రాజీనామా ఆమోదం తెరమీదికి వచ్చింది. ఆ…
ఆంధ్రప్రదేశ్‌లో 27,400 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. సెక్షన్ 26 విద్యా హక్కు చట్టం కింద టీచర్ పోస్టులు 10 శాతం కంటే ఎక్కువ ఖాళీగా ఉండకూడదనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. 27 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు..
గత 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. 4 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి నారా లోకేష్.. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్‌ను ప్రారంభించారు లోకేష్.. దీంతో, అమరావతిలో తొలి ఆటోమొబైల్ ప్లాంట్‌గా నిలిచింది అశోక్ లేలాండ్.. ఈ యూనిట్లో ఎలక్ట్రిక్, డీజిల్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్.. ఈ ప్లాంట్…
తిరుమలలో వైకుంఠద్వారా దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీ సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణ మూర్తి విచారణ కొనసాగుతోంది.. తిరుమల, తిరుపతిలో విచారణ సాగుతోంది.. అయితే, రేపు మరోసారి విచారణకు హాజరు కావాలంటూ అధికారులకు నోటీసులు జారీ చేసింది తొక్కిసలాట ఘటమపై ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్.
కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్‌ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్.. దీంతో, అమరావతిలో తొలి ఆటోమొబైల్ ప్లాంట్‌గా నిలిచింది అశోక్ లేలాండ్.. ఈ యూనిట్లో ఎలక్ట్రిక్, డీజిల్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్.. ఈ ప్లాంట్ ఏడాదికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది..
IT Raids : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో భారీగా ఆదాయపు పన్ను (ఐటీ) అధికారుల సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన క్రేన్ వక్కపొడి కంపెనీ కార్యాలయాలు, చైర్మన్ కాంతారావు నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ దాడులు చేపట్టింది. రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. ఈ దాడులలో ఇప్పటి వరకు 40 కేజీల బంగారం.. 100 కేజీల వెండి.. 18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా,…
ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంపీ కోసం నిధులు మంజూరు చేసింది కేంద్రం.. రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటిపోవడంతో.. తిరిగి మరోసారి ప్లాన్ రూపొందించాలని కోరింది సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం.. అయితే, కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేసింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్.. రెండు నగరాల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన…
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సునీత విలియమ్స్ కు అభినందనలు.. శుభాకాంక్షలు చెప్పింది శాసనసభ... సునీత విలియన్స్ జీవితం స్ఫూర్తి దాయకం అన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. తర్వాత అసెంబ్లీ లో క్వశ్చన్ అవర్ ప్రారంభం అయింది.. సంచార పశువైద్యశాలలు... విశాఖ స్టీల్ ప్లాంట్ భూములలో. రైతులకు నష్టపరిహారం.. ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యం..ఈ అంశలకు సంబంధించి చర్చ జరిగింది..