Kakani Govardhan Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఈ రోజు కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు.. అయితే, పోలీసులకు మాత్రం సమాచారం ఇచ్చారట కాకాణి.. రేపు రాత్రికి నెల్లూరు చేరుకోనున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. గురువారం నుంచి తాను అందుబాటులో ఉంటానని పోలీసులకు సమాచారం చేరవేశారట.. రేపు కుటుంబ శుభకార్యంలో పాల్గొని నెల్లూరుకు వస్తానని తెలిపారట.. దీంతో మరోసారి కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.. కాగా, ఆదివారం రోజు నెల్లూరులోని మాజీ మంత్రి ఇంటికి పోలీసులు నోటీసులు తీసుకొని వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో.. ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు పోలీసులు.. మరోవైపు.. హైదరాబాద్‌లో ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకున్న పోలీసులు.. సోమవారం రోజు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు.. అయితే, అక్కడ కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో.. సంబంధిత నోటీసులను కుటుంబ సభ్యులకు అందజేసిన విషయం విదితమే..
Read Also: Yogi Adityanath: యూపీలో తమిళం, తెలుగు నేర్పిస్తున్నామన్న యోగి.. వివరాలు చెప్పాలన్న కార్తీ!
మొదట సోమవారం రోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా ఆదివారం ఇచ్చిన నోటీసుల్లో పేర్కనగా.. సోమవారం ఇచ్చిన నోటీసుల్లో మాత్రం.. మంగళవారం అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు.. కానీ, రెండు రోజులు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. కాగా, చెన్నైలో నివాసముండే విద్యా కిరణ్‌కు పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని 32 ఎకరాల్లో రుస్తుం మైన్ పేరిట మైకా తవ్వకాలకు అనుమతి ఉండగా.. లీజు గడువు ముగియడంతో పునరుద్దరణకు దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు.. గత ప్రభుత్వ హయాంలో తెల్లరాయి గనులపై ఆ పార్టీ నేతలు కన్నేశారని.. లీజుదారుడు అంగీకరించకపోయినా కొందరు ప్రజాప్రతినిధుల అండతో దౌర్జన్యంగా తెల్లరాయిని తరలించారనే ఆరోపణలు ఉన్నాయి.. అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాణి.. సొంత గ్రామం తోడేరుకు సమీపంలోనే మైనింగ్‌కు పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి.. దీనిపై టీడీపీకి చెందిన మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోన్న విషయం విదితమే..