Elamanchili: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మాన రాజకీయం కీలక మలుపు తిరిగింది. చైర్ పర్సన్ రమా కుమారిపై ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకునేందుకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక్క ఓటు తగ్గిన వైసీపీ బలం.. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన సంఖ్య 16 కాగా.. దీంతో వైసీపీ నాయకత్వం తర్జన భర్జన పడుతుంది. 25 మంది కౌన్సిలర్లు.. ఒక ఎక్స్ అఫిషియో ఓటును సైతం యలమంచిలి మున్సిపాలిటీ కలిగి ఉంది.
Read Also: Train Accident : ఢీకొన్న రెండు గూడ్స్ రైళ్లు.. ముగ్గురి మృతి
అయితే, గత ఎన్నికల్లో వైసీపీ 23 స్థానాల్లో గెలవగా.. టీడీపీ, జనసేన ఖాతాల్లో చెరో స్థానం ఉంది. కానీ, ఇటీవల వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చైర్ పర్సన్ రమాకుమారి బీజేపీలో చేరారు. ప్రస్తుతం కూటమి శిబిరంలో 8 మంది వైసీపీ సభ్యులు ఉన్నారు. దీంతో ఛైర్ పర్సన్ రమాకుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను వెనక్కి తీసుకునే ఆలోచనలో వైసీపీ శ్రేణులు పడ్డారని టాక్.