Ranabaali Poster: ‘రణబాలి’ వెడ్డింగ్ పోస్టర్ వెనుక అసలు కథ ఇదే.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ భావోద్వేగ పోస్ట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘గీతా గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించింది. తాజాగా వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘రణబాలి’. ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి రూపొందుతోంది. ఇందులో రణబాలి పాత్రలో విజయ్, జయమ్మగా రష్మిక నటిస్తున్నారు. నిజ జీవితంలో విజయ్-రష్మిక కలిసి ఏడడుగులు వేసిన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ‘రణబాలి’ యూనిట్ పెళ్లి పాటని విడుదల చేసింది.
ఇక డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ రణబాలికి సంబంధించి ఓ వెడ్డింగ్ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వెడ్డింగ్ పోస్టర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో చెబుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అది సాధారణ పోస్టర్ కాదని, ఓ నిజమైన క్షణాన్ని బంధించిన దృశ్యమని తెలిపారు. తన తల్లిదండ్రులు, తాతముత్తాతల పాత ఫోటోలంటే తనకు చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తి ఉండేదని.. ఆ కాలం ఫోటోలలో పోజులు లేని సహజత్వం, నిజాయితీ కనిపిస్తాయని చెప్పారు. అదే సహజత్వాన్ని రణబాలి మూవీలో చూపించడమే తన లక్ష్యమని రాహుల్ వెల్లడించారు.
Also Read
‘1800 చివరి కాలంలో గ్లామర్ లేని జీవనశైలి ఉండేది. కానీ ఆ కాలంలోని వివాహాలకు గౌరవం, విలువ ఉండేదది. రణబాలి షూటింగ్ రోజు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు పెళ్లి వేషధారణలో సెట్లోకి వచ్చినప్పుడు వాతావరణమే మారిపోయింది. వారు నటులు లాగా కాకుండా.. నిజంగా ఆ కాలం నాటి వరుడు-వధువుల్లా కనిపించారు. ఎలాంటి ప్రత్యేక లైటింగ్ లేకుండా, స్టైలిష్ పోజులు లేకుండా సాధారణ బ్యాక్‌డ్రాప్‌తో షూటింగ్ చేయాలనిపించింది. ఇద్దరూ తమ క్యారెక్టర్‌లో పూర్తిగా లీనమై కాలాన్నే మరిపించారు. ఆ ఫోటో చూసినప్పుడు గత జీవితంలోని పెళ్లి జ్ఞాపకం లాగా అనిపిస్తుంది. సినిమా, జీవితం కొన్ని సందర్భాల్లో ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఆ అనుభూతినే ఈ పోస్టర్ ఆడిస్తుంది. శాశ్వతమైన బంధాలు కాలాన్ని మరపిస్తాయి. అదే భావోద్వేగం రణబాలి మూవీకి బలమైన మూల స్తంభం’ అని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం రణబాలి పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
STORY BEHIND THE WEDDING POSTER
Yesterday, we released the wedding poster of Ranabaali.
But this wasn’t designed as a “poster.” It was a moment.
I’ve always been fascinated by old photographs — our parents, grandparents… the way they stood before a camera. No posing. No… pic.twitter.com/ppuBj9tMjQ
— Rahul Sankrityan (@Rahul_Sankrityn) March 1, 2026
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!