* నేడు ఏపీలో పెన్షన్ల పంపిణీ.. ఉదయం 6గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందికి పైగాపెన్షన్ల పంపిణీ.. ఉదయం 10. 40 గంటలకు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పెద్దగంజాం, కొత్త గొల్లపాలెంలో పెన్షన్ల పంపిణీ.. పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. అనంతరం పార్టీ సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు
* నేడు సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు.. రేపు ఢిల్లీలో మహాధర్నాకు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై.. తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని డిమాండ్.. బీసీ సంఘాల మహాధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపనున్న.. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
* నేడు ఉదయం 11గంటలకు కిమ్స్ ఆస్పత్రికి వైసీపీ మహిళ ప్రతినిధి బృందం.. రాజమండ్రిలో సూసైడ్ కు యత్నించిన మెడికల్ విద్యార్థిని అంజలి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజలిని పరామర్శించనున్న వైసీపీ బృందం..
* నేటికి వాయిదా పడిన కాకాణీ గోవర్థన్ రెడ్డి పోలీసుల విచారణ.. ఉదయం 11గంటలకి విచారణకు రావాలని కాకాణికి నోటీసులు..
* నేడు కాకాణి గోవర్థన్ రెడ్డి క్వాష్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. పొదలకూరులో తెల్లరాయి అక్రమ రవాణా చేస్తున్నారని కాకాణిపై కేసు..
* నేడు ఏపీలో ఆప్షనల్ హాలీడే ప్రకటించిన సర్కార్.. ఆప్షనల్ హాలీడేపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
* నేడు ఏపీలో పదో తరగతి సోషల్ పరీక్ష యథాతథం.. సోషల్ పరీక్షలో ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ వెల్లడి.. ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు సోషల్ పరీక్ష..
* నేడు హెచ్ సీయూకి బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం.. హెచ్ సీయూ భూములను సందర్శించనున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. హెచ్ సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ..
* నేటి నుంచి అమల్లోకి ఔటర్ రింగ్ రోడ్డు మీద పెరిగిన ధరలు.. కారు, జీపు, వ్యాన్ లకు కిలోమీటర్ కు 10 పైసలు పెంపు.. మినీబస్, ఎల్సీవీలకు కిలోమీటర్ కు 20 పైసలు..
* నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన.. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు.. 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు తగ్గే ఛాన్స్..
* నేడు ఏపీలో భారీగా పెరగనున్న ఎండలు.. 26 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం..
* నేడు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్.. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్..