Pension Distribution: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. ఇక, బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజక వర్గంలోని కొత్త గొల్లపాలెం, పెద్ద గంజాంలో పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. పెన్షన్ల పంపిణీ అనంతరం స్థానికులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అలాగే, మధ్యాహ్నం పర్చూరు నియోజక వర్గంలోని టీడీపీ క్యాడర్ తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
Read Also: MI vs KKR: బోణి కొట్టిన ముంబై ఇండియన్స్.. 8 వికెట్లతో భారీ విజయం.
సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్..
ఇక, ఇవాళ సీఎం చంద్రబాబు ఉదయం 10.40 నిమిషాలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా కొత్త గొల్లపాలెంకి బయలు దేరుతారు.. 11.10 నిమిషాలకు కొత్త గొల్లపాలెంకి చేరుకోనున్నారు. 11.45 నుంచి 12.25 మధ్య లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పించన్లు పంపిణీ చేయనున్నారు. 12.25 నిమిషాలకు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానికులతో ముఖాముఖి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు. అలాగే, మధ్యాహ్నం 2.15 నుంచి 3.35 వరకు పర్చూరు నియోజక వర్గ టీడీపీ క్యాడర్ తో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3.45 గంటలకి హెలికాఫ్టర్ లో కొత్త గొల్లపాలెం నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్ళనున్నారు సీఎం చంద్రబాబు.