Andhra Pradesh: ఆస్తులు, అంతస్తుల కోసం కన్నవారిని, కట్టుకున్నవారిని, అయినవారిని.. ఇలా ఎవరు అనేది చూడడం లేదు.. చివరకు కన్న తల్లి, తండ్రుల పట్ల కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. చిత్తూరు జిల్లాలో తాజాగా, ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. అస్తికోసం కోసం కన్న తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు, కోడలు.. పుంగనూరు మండలం దిగువ చదళ్లలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అస్తికోసం కన్న తండ్రిని ఇంటి నుంచి గెంటివేవారు.. గతంలో కోడలు పేరు పై 10 ఎకరాల భూమి రాసిచ్చాడు బాధిత మామ కృష్ణప్ప.. అయితే, మిగిలిన రెండున్నర ఎకరాల భూమిని కూడా మోసాగించి.. దేవరాజ్ అక్రమంగా విక్రయ పత్రం రాయించుకున్నాడని తండ్రి కృష్ణప్ప ఆవేదన వ్యక్తం చేశారు. తన రెండున్నర ఎకరాల భూమి తనకు ఇప్పించాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశానన్నాడు. సంవత్సరం నుంచి తనను ఇంటి నుంచి కొడుకు, కోడలు గెంటేసారని తండ్రి కృష్ణప్ప తన బాధను వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేసి తమ భూమిని తనకు కొడుకు దగ్గర నుంచి ఇప్పించాలని కోరాడు..
Read Also: Sobitha : సంచలన డైరెక్టర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన శోభిత..