Anchor Syamala: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మరోసారి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పరిపాలన చేసే సత్తా లేదని ఒక పెద్ద మనిషి చెప్తున్నారని అన్నారంటూ సెటైర్లు వేశారు.. రాజమండ్రి కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితిని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత దృష్టికి తీసుకు వెళ్ళచ్చు కదా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఆ పని కూడా చేయలేదని విమర్శించారు. రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మెడికల్ విద్యార్థిని అంజలిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధి బృందం పరామర్శించింది. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల. హాస్పిటల్ కి విచ్చేసి అంజలి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.. బాధితురాలు కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Read Also: Sikandar: సల్మాన్ ఖాన్‌కు ఘోర అవమానం
ఇక, ఈ సందర్భంగా వరుడు కళ్యాణి, యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన దీపక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ కేసు పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కోరారు. బాధితురాలికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బాధితురాలే ప్రమాదకరమైన ఇంజెక్షన్ తీసుకుందా..? లేక ఎవరైనా ఇచ్చారో.. బయట పెట్టాలని, అంజలి విషయంలో అనుమానాలు చాలా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలు భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. బాధితులు ఆరోగ్యం విషయమై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోషులకు కఠిన శిక్షలు పడట్లేదని విమర్శించారు. ప్రతి గంటకు ముగ్గురు మహిళలు అఘాయిత్యానికి గురవుతున్నారని, అయినా ప్రభుత్వంలో స్పందన లేదని ఆరోపించారు.. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ విమర్శలు గుప్పించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల.