YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీలు, ఎంపీపీలు, మున్సిపల్ కార్పొరేషన్లు.. ఇలా పలు చోట్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టడం.. అందులో మెజార్టీ సాధించినవారు విజయం సాధించారు.. అయితే, కూటమి ప్రభుత్వం కేసులు, వేధింపులు, ప్రలోభాలతో కొన్నింటిని కైవసం చేసుకుందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.. అయితే, అధికార కూటమి పార్టీల వేధింపులను తట్టుకుని నిలబడిన ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో.. వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ ప్రత్యేకంగా భేటీకాబోతున్నారు..
Read Also: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు
రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరపున గట్టిగా నిలబడిన ప్రజా ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించనున్నారు వైఎస్ జగన్.. కేసులు పెట్టి వేధించినా.. ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని.. పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు.. ఈ సమావేశానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలకు చెందిన 8 నియోజకవర్గాల్లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్షన్ సభ్యులు హాజరుకావాలని ఇప్పటికే సమాచారం అందించారు.. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపైనా దిశా నిర్దేశం చేయనున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..