CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఆ తర్వాత నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. వారసత్వంగా నాకు అప్పు వచ్చింది.. రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.. అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది.. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తా అన్నారు.. తల్లికి వందనం మేలో ఇస్తా.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తాం.. ఇక, నుంచి నాలుగు నెలలకి ఒకసారి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం.. రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఇస్తాం.. మే, జూన్ లో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 20 వేలు ఇస్తామని వెల్లడించారు..
Read Also: illicit Relationship: స్నేహితుడి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. కొట్టి చంపిన బంధువులు
ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారు అని ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు.. ఇక, మనకంటే ధనికమైన రాష్ట్రం తెలంగాణలో మనకంటే తక్కువ పింఛన్ ఉందన్నారు.. నేను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానో విమర్శించే వాళ్లు కళ్లుండి చూడాలన్నారు.. అమరావతి రాజధాని ని గాడిలో పెట్టాం.. 3,4 సంవత్సరాల్లో అమరావతి కి పూర్వ వైభవాన్ని తీసుకువస్తాం అన్నారు.. 2027కి పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు.. విశాఖ ఉక్కుని దివాళా తీయించారని ఫైర్ అయ్యారు.. కానీ, విశాఖ ఉక్కుకి 11 వేల కోట్లు నిధులు తీసుకువచ్చాం.. విశాఖ స్టీల్ కూడా గాట్లో పడింది.. విశాఖ కి రైల్వే జోన్ కూడా వచ్చిందన్నారు.. గతంలో రోడ్లు గుంటల మయంగా మారాయి.. హాస్పిటల్ కి వెళ్ళాలంటే రోడ్డుపైనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉండేదన్నారు.. ఇక, ఈ నెలలోనే డీఎస్సీ పూర్తి చేసి స్కూల్స్ ప్రారంభం అయ్యే నాటికి కొత్త టీచర్లను నియమిస్తామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.
Read Also: Chennai: నేటి నుంచి ఊటీ, కొడైకెనాల్‌లో కొత్త రూల్స్.. తెలియక తెలుగు టూరిస్టులు ఇబ్బందులు
సంక్షేమం ఇవ్వలేదనే వాల్లు కళ్లు ఉంటే చూడాలి.. మనసుంటే మాట్లాడాలి అన్నారు సీఎం చంద్రబాబు. మీ దగ్గరకు ఎవరైనా వచ్చి అడిగితే మనం ఇచ్చే పింఛన్ల సంగతి చెప్పండి.. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజనం అందిస్తున్నాం.. అమరావతి రాజధాని వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి.. అమరావతిని మరో మూడేళ్లలో గాడికి పెడతాం.. అమరావతికి పూర్వవైభవం తెస్తాం.. నదుల అనుసంధానం చేయాలని పోలవరాన్ని గాడిలో పెడుతున్నాం.. వ్యవసాయం సజావుగా సాగుతుందన్నారు.. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని పోరాడాం.. జనసేన, బీజేపీ నేతలతో కలసి మాట్లాడాం.. విశాఖ స్టీల్ కూడా గాడిలో పడింది.. ఇలా పరిపాలన సమర్థవంతంగా చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది.. విశాఖ రైల్వే జోన్ వచ్చింది.. రోడ్లు మొత్తం బాగుచేసాం.. భవిష్యత్తులో రోడ్లు అద్దంలా చేస్తాం.. పిల్లల ఉద్యోగాల కోసం మెగా డీఎస్సీ.. స్కూల్ ఓపెన్ అయ్యే లోపు కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకుంటాం.. చేనేత కార్మికులు, వడ్డెర, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు కోసం ఏం చేస్తే జీవితాలు బాగుపడతాయో ఆలోచన చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు..