Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 44 బార్లను ఈ-వేలం, ఆన్ లైన్ లాటరీ పద్ధతిలో ప్రభుత్వం కేటాయించనుంది. రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లు ఈ-వేలం ద్వారా కేటాయింపులు జరపనున్నారు. మద్య నిషేధ, అబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. బార్ల లైసెన్సులు తీసుకునేందుకు ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 7వ తేదీతో ప్రక్రియ ముగియనుంది. అభ్యర్థులు తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుమును 8లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.
Read Also: Waqf Bill: నేడు లోక్‌సభలో, రేపు రాజ్యసభలో వక్ఫ్ బిల్లు.. చర్చకు 8 గంటల సమయం..
అయితే, 50 వేల జనాభా ఉంటే రూ.5 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా వరకు ఉంటే రూ.7. 5లక్షలు.. 5 లక్షలకు పైగా జనాభా ఉంటే.. రూ.10 లక్షలుగా దరఖాస్తు రుసుములు చెల్లించాలని తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అధిక మొత్తంలో పాడుకున్న అభ్యర్థికి ఈ నెల 9వ తేదీన బార్ కేటాయింపు చేయనున్నారు. నగర పాలక, ప్రదేశాల వారీగా బార్ల వివరాలు, ఆఫ్ సెట్ ధరలు, గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇతర వివరాలకు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది.