Visakhapatnam: విశాఖపట్నంలో స్కూల్ విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ పిల్లల ప్రాణాలని మద్యానికి పణంగా పెట్టాడు ఆటో డ్రైవర్.. మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవర్ డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన విషయం పిల్లల తల్లిదండ్రులకు పోలీసుల తెలియజేశారు.
Read Also: Virat Kohli Retirement: రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ!
ఇక, ప్రమాద ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు ఆటో డ్రైవర్ కి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చెయ్యగా 550 పాయింట్స్ వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని.. అతడిపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా ఆటో నడపటంతో పాటు మద్యం మత్తులో ప్రమాదానికి కారణమైన వ్యక్తిని రిమాండ్ కు తరలించారు.