CM Chandrababu: విజయవాడ సిటీకి గుడ్‌న్యూస్.. బైపాస్‌కు గ్రీన్ సిగ్నల్..
- విజయవాడ సిటీకి గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..
- రాజధాని ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే పూర్తి చేసేలా ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాజధాని అమరావతి ప్రాంతంలో ముమ్మరంగా కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్స్ ఇచ్చారు. దీంతో రాజధాని ప్రాంతానికి కీలక జాతీయ రహదారి అందుబాటులోకి రావడమే కాకుండా, అక్కడి నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్‌ను సులువుగా తరలించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి వరకు ఉన్న విజయవాడ బైపాస్ (చెన్నై-కోల్‌కతా హైవే బైపాస్) ఉంది. అందులోని కాజా – గొల్లపూడి ప్యాకేజీ 17.88 కిలోమీటర్లు. ఇది రాజధాని ప్రాంతంలోని 9 గ్రిడ్ రోడ్ల మీదుగా వెళ్తుంది. వీటిలో ఇ-3, ఇ-8, ఇ-10, ఇ-13, ఇ-15 గ్రిడ్ రోడ్లు క్రాస్ అయ్యేచోట్ల ఎన్‌హెచ్‌ఏఐ అండర్ పాస్‌లను నిర్మించింది. దీనివల్ల ఆయా గ్రిడ్ రోడ్లలో రాకపోకలు సాగించే వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
Read Also: Waqf amendment bill: వక్ఫ్ బిల్లుపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు..
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
అయితే ఇ-9, ఇ-11, ఇ-12, ఇ-14 గ్రిడ్ రోడ్ల వద్ద మాత్రం అండర్‌పాస్‌లు లేకుండానే, బైపాస్ నిర్మాణ పనులు పూర్తియయ్యిపోయాయి. దీంతో బైపాస్ క్రాస్ అయ్యేప్రాంతాల్లో ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఈ గ్రిడ్ రోడ్లపై రాకపోకలు సాగించేవారు.. బైపాస్ దాటి వెళ్లాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలిసినా గత ప్రభుత్వ హయాంలో ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పనులు చేసేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు గ్రిడ్ రోడ్ల వద్ద అండర్‌పాస్‌లు లేని విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రావడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడ అండర్‌పాస్‌లు ఉండాల్సిందేనని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ నాలుగు చోట్ల బైపాస్‌ను కట్‌చేసి, అండర్‌పాస్‌ల నిర్మాణానికి అంచనాలు రూపొందించే ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంది.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్
తాజాగా సీఎం చంద్రబాబు, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీతో సమావేశం అయ్యి ఇదే అంశంపై చేర్చించారు. రాజధాని పనులు వేగంగా జరుగుతున్న వేళ మొదట బైపాస్ నిర్మాణం పూర్తిచేయాలని, ఆ తర్వాత నాలుగు గ్రిడ్ రోడ్ల వద్ద అండర్‌పాస్‌లు నిర్మించేలా ఇద్దరూ మాట్లాడుకుని, నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ప్రస్తుతం బైపాస్ ఆపేసి, నాలుగు చోట్ల అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తిచేయాలంటే మరో 15 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, తొలుత బైపాస్ పూర్తిచేయడానికే పచ్చ జెండా ఊపారు.. దీంతో ఈ పనులు మరింత వేగంగా సాగనున్నాయి. వర్షాలు మొదలయ్యే లోపు జూన్ ఆఖరుకు బైపాస్ పెండింగ్ పనులు అని పూర్తయ్యి అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
-
MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు రెండు రెడ్లకేనా.?
-
Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!