YS Jagan: ఇవాళ తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరపున నిలబడిన ప్రజా ప్రతినిధులను అభినందించనున్నారు. ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ కోసం పోరాడిన వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్షన్ సభ్యులు హాజరుకానున్నారు.
Read Also: LSG vs PBKS: దంచికొట్టిన ప్రభ్ సిమ్రాన్.. లక్నోపై పంజాబ్ విజయం
అయితే, స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను స్వయంగా మాజీ సీఎం వైఎస్ జగన్ కలవనున్నారు. ఇక, భవిష్యత్ కార్యాచరణ పైనా సమావేశంలో నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో మనం విజయం సాధించాలంటే.. నిరంతరం ప్రజల్లో ఉండాలని వారికి జగన్ సూచించే అవకాశం ఉంది.