Minister Bala Veeranjaneya Swamy: పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి ఇళ్ల స్థలాల కోసం ఇస్తామని తెలిపారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పని చేస్తున్నారని తెలిపారు.. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు తరిమేశారు… సీఎం చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకువస్తున్నారని వెల్లడించారు.. ఇక, ఓ కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా వారి అందరికీ తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపిన ఆయన.. జలజీవన్ మిషన్ ని గత ప్రభుత్వంలో దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జలజీవన్ మిషన్ ని గాడిలో పెట్టారని తెలిపారు.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో గోతుల నిర్మాణం జరిగింది అంటూ.. అప్పటి రోడ్ల పరిస్థితిపై సెటైర్లు వేశారు.. అయితే, గత ప్రభుత్వ హయాంలో నిధులన్నీ ఏమైపోయాయో తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు వేశామని గుర్తుచేశారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి..
Read Also: Vikarabad: కాల్వలో మహిళ మృతదేహం.. గుర్తు పట్టకుండ ముఖం కాల్చి..