Minister Satyakumar Yadav: గతంలో పోలిస్తే.. ఇప్పుడు వైద్యం వ్యాపారంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో జరిగిన ఏపీ మెడికల్ కౌన్సిల్ లో నామినేటెడ్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆరుగురు సభ్యులను నామినేటెడ్ పోస్టుల్లో ఎన్నుకున్నాం.. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను… మంచి అనుభవం కలిగిన డాక్టర్లను ప్రభుత్వం ఎన్నుకుందన్నారు.. తరతరాలుగా వైద్యుల్ని దేవుడు పోల్చేవారు.. ఇదివరకు పోలిస్తే ఇప్పుడు వైద్యం వ్యాపారంగా మారిందన్న ఆయన.. డాక్టర్లు రోగులను మానవత దృష్టితో చూడాలని సూచించారు.. వైద్యవృత్తి విలువలు పల్చబడ్డాయి.. అవసరం లేకుండానే ఎక్సరేలు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ లు తీస్తున్నారు.. అలాగే నార్మల్ డెలివరీ చేయడం మానేశారు.. అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారు.. ప్రభుత్వ డాక్టర్లు గానీ.. ప్రైవేట్ డాక్టర్లు గానీ నార్మల్ డెలివరీస్ చేస్తే బాగుంటుందన్నారు..
Read Also: AP Weather Update: అలర్ట్.. ఈ జిల్లాల్లో 3 రోజులు పిడుగుల వర్షం.. ఆ జిల్లాల్లో తీవ్ర ఎండలు..!
ప్రజలు కూడా రకరకాల టెస్టులు రాస్తేనే మాకు సరిగ్గా డాక్టర్లు చూశారని అపోహలో ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి సత్యకుమార్.. అటువంటి వారికి అవగాహన కల్పించాలి.. వచ్చిన పేషెంట్ ను చిరునవ్వుతో డాక్టర్లు స్వాగతం పలకాలని సూచించారు.. డాక్టర్లు సర్టిఫికెట్లను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి.. కొత్త కౌన్సిల్, ఏపీఎంసీ సర్టిఫికెట్స్ రెన్యువల్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.. ఫారెన్ రిటర్న్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదు.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు ఆరుగురు నామినేటెడ్ మెంబెర్స్ ప్రమాణ స్వీకారం చేశారు.. ఇంకా నలుగురు ఎక్స్ అఫీషియో మెంబర్స్, 13 ఎలక్టెడ్ మెంబర్స్ ను ఇంకా ఎన్నుకోవాల్సి ఉంది.. మొత్తం ఈ కౌన్సి్‌ల్‌లో 23 మంది ఉంటాని వెల్లడించారు.. చైర్మన్, వైస్ చైర్మన్ లను కూడా ఇంకా ఎన్నుకోవాల్సిందని తెలిపారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
Read Also: Redmi A5: 5200mAh బ్యాటరీతో Redmi కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల.. ధర రూ. 6 వేలు మాత్రమే
కాగా, విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్(ఏపీఎంసీ) సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నాను. ఎపీఎంసీ సభ్యులుగా డాక్టర్ గోగినేని సుజాత, డాక్టర్ కె.వి.సుబ్బానాయుడు, డాక్టర్ డి.శ్రీహరిబాబు, డాక్టర్ స్వర్ణగీత, ఎస్.కేశవరావు బాబు, డాక్టర్ సి.మల్లీశ్వరి ప్రమాణస్వీకారం చేయగా వారికి అభినందనలు తెలిపారు.. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి, నైతిక ప్రమాణాలను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి నిపుణులైన వైద్యులను ఏపీఎంసీ సభ్యులుగా నియమించడమే నిదర్శనం. అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని, వైద్య రంగాన్ని ఆదర్శనీయంగా నిలపాలని కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులను ఈ సందర్భంగా కోరారు మంత్రి సత్యకుమార్..