Allagadda: నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో దారుణం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ వేధింపులు భరించలేక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెల్ఫీ తీసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్న డ్రైవర్..
Visakhapatnam: విశాఖపట్నంలో మేయర్ పై అవిశ్వాసం తీర్మానం నోటీసుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. GVMC ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం పంపిన అజెండా చూసి కార్పొరేటర్లు అవాక్కయ్యారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో ఏర్పాటు చేస్తున్న ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నమోదైన కేసులో తదుపరి కార్యాచరణ కోసం పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఆయనను విచారించేందుకు మూడుసార్లు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించిన కాకాణి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన ఎక్కడున్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.. నెల్లూరు, హైదరాబాద్‌తో పాటు మరికొన్ని చోట్ల ఆరా తీస్తున్నారట పోలీసులు..
బర్డ్‌ఫ్లూలో బాలిక మృతిచెందడం ఇదే తొలిసారి కావడంతో.. కేంద్రం సైతం రంగంలోకి దిగింది.. నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ (H5N1) లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పాలసీలు సిద్ధం చేశారు.. అలాగే వాటిని అవలంభించడానికి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా సిద్ధం చేశారు.. గత ప్రభుత్వం పాలసీలు చేసి గైడ్ లైన్స్ ఇవ్వకుండా వదిలేసిన వాటికి సైతం గైడ్ లైన్స్ ఇచ్చారు... యువ పారిశ్రామికవేత్తలకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మూడు ప్రధాన పాలసీలను రూపొందించారు.. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే ప్రధాన టార్గెట్ గా పని చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రులకు దిశానిర్దేశం చేసిన విషయం విదితమే…
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
కీచకుడి కామ దాహానికి మెడికల్ విద్యార్థిని బలైపోయింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న మెడికల్ విద్యార్థిని అదే ఆస్పత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న కీచకుడు వంచించాడు. పెళ్లి చేసుకుంటానని ని నమ్మించి మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయింది ఆ యువతి. మరణమే శరణ్యం అనుకుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడి 12 రోజులు పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది.
శ్రీశైలం ఆలయానికి వెళ్తుండగా పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది.. అయితే, ఈ ప్రమాదంలో తృటిలో తప్పించుకుని బయటపడ్డారు ప్రయాణికులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో మంటలు చెలరేగి భక్తుల కారు దగ్ధం అయ్యింది.. గుంటూరుకు చెందిన భక్తులు ఇన్నోవా కారులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది..